జగన్ దరిద్రమే వైఎస్ మరణానికి కారణం:మంత్రి ఆది, మోడీపై ఎంపీ బుర్రకథ

కడప: జగన్మోహన్ రెడ్డి దరిద్రమే అతడి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణమని మంత్రి ఆదినారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. ఒకవేళ జగన్ పొరపాటున సీఎం అయితే రాష్ట్రాన్ని విదేశాలకు తాకట్టుపెట్టడం ఖాయమన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో నిర్వహిస్తోన్న"ధర్మ పోరాట దీక్ష"కు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతలు అన్నినియోజకవర్గాల్లో దీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి కడపలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి న్యాయం జరిగే వరకు తమ పోరాటాలు ఆగవని స్పష్టం చేశారు.

వేచి చూసి...విసిగి పోయి...దీక్ష

వేచి చూసి...విసిగి పోయి...దీక్ష

కేంద్రం నుంచి ఎపికి తగిన న్యాయం కోసం నాలుగేళ్ళు వేచి చూసి విసిగిపోయి దీక్షకు దిగినట్లుగా చెప్పారు. చంద్రబాబు దీక్షకు ప్రజలు స్వచ్చందంగా తమ మద్దతు ప్రకటిస్తున్నారని, ఆయన దీక్షతో మరో ప్రజా ఉద్యమం రావడం ఖాయమని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు.

న్యాయం చేయకుంటే...అడ్రస్ గల్లంతే...

న్యాయం చేయకుంటే...అడ్రస్ గల్లంతే...

సిఎం చంద్రబాబు దీక్షకు మద్దతుగా పుట్టపర్తిలో దీక్ష చేపట్టిన ఛీప్ విప్ పల్లె రఘునాథరెడ్డి మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టంలో అంశాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ను అడ్డంగా విభజించిన కాంగ్రెస్ పార్టీని తెలుగు ప్రజలు అడ్రస్ లేకుండా చేశారని హామీలు, ప్రత్యేక హోదాపై మాటమార్చిన బీజేపీకి, మోదీకి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఆనాడు ఎన్టీఆర్ ఇందిరాగాంధీని ఏపీలో నామారూపాలు లేకుండా చేసి చరిత్ర సృష్టించారని, ఇప్పుడు బీజేపీతో తెగదెంపులు చేసుకుని రాష్ట్రం కోసం ధర్మ పోరాట దీక్ష చేస్తున్న నాయకుడు చంద్రబాబు అని పల్లె కొనియాడారు.

మోడీ గతి...అథోగతే

మోడీ గతి...అథోగతే

మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో చేపట్టిన ధర్మ పోరాటం దీక్షకు మద్దతుగా శుక్రవారం పలమనేరు ఏ.టి.యం సర్కిల్ వద్ద జరిగిన దీక్షలో చిత్తూరు ఎంపి శివప్రసాద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నారదుడి వేషధారణతో ప్రధాని మోడీకి ఎపికి చేసిన అన్యాయం గురించి బుర్రకథ
చెప్పారు. చంద్రబాబుతో పెట్టుకుంటే మోడీ గతి అథోగతేనని ఎద్దేవా చేశారు.

పోరాటాలతో...మెడలు వంచుతా...

పోరాటాలతో...మెడలు వంచుతా...

వరుస పోరాటాలతో మోదీ ప్రభుత్వం మెడలు వంచితీరుతామని ఎంపీ సీఎం రమేష్ చెప్పారు. చంద్రబాబు దీక్షకు మద్దతు ప్రకటించిన సిఎం రమేష్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పోరాటాలతో మోదీ దిగిరాకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. మోదీతో జగన్‌ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని, ఆ విషయం ప్రజలకు కూడా అర్థమైందని అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీది దొంగ పోరాటమని ప్రజలకు తెలుసని, అందుకే వారిని ఛీత్కరిస్తున్నారని ఎంపీ సీఎం రమేష్‌ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+