టీడీపీ వర్సస్ వైసీపీ, కలిసొచ్చేదెవరికి - డిసైడింగ్ టైం..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ లక్ష్యంగా టీడీపీ, జనసేన కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. సంక్షేమం - సామాజిక న్యాయం నినాదాలతో వైసైపీ వై నాట్ 175 అంటూ ముందుకు వెళ్తోంది. టీడీపీ కంచుకోటలను 2019లో బద్దలు కొట్టిన టీడీపీ 2024లోనూ రిపీట్ చేయాలని భావిస్తోంది. ఈ సమయంలోనే టీడీపీ అలర్ట్ అయింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అటు టీడీపీ..ఇటు వైసీపీ కొత్త లెక్కలతో ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి.
రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మకం : ఏపీ నడిబొడ్డున ఉన్న జిల్లాల్లో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణా , గుంటూరు జిల్లాల్లో 2019 ఎన్నికల్లొ టీడీపీ ఊహించని దెబ్బ తింది. రెండు జిల్లాల్లోనూ నాలుగు సీట్లను మాత్రమే టీడీపీ గెల్చుకుంది. వచ్చే ఎన్నికల్లోనూ పట్టు నిరూపించుకోవాలని వైసీపీ, తిరిగి పట్టు సాధించాలని టీడీపీ భావిస్తోంది.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వచ్చే ఎన్నికల కోసం వైసీపీ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. సామాజిక సమీకరణాల ఆధారంగా నియోజకవర్గాల్లో ఎన్నికల వ్యూహాల అమలుకు సిద్దం అవుతోంది. ఈ సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో నారా లోకేశ్ యువగళం యాత్ర ఈ నెల ఎన్టీఆర్ జిల్లాలో 19న ప్రవేశిస్తోంది. లోకేశ్ యాత్రను సక్సెస్ చేసేందుకు పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు.
లోకేశ్ యాత్ర వేళ కీలకంగా : అమరావతి పరిధిలోని తాడికొండ నియోజకవర్గంలో ప్రస్తుతం లోకేశ్ యాత్ర కొనసాగుతోంది. తరువాత తాను పోటీ చేయనున్న మంగళగిరిలో యాత్ర చేస్తూ ప్రకాశం బ్యారేజీ మీదుగా ఎన్టీఆర్ జిల్లాలోకి ఈ నెల 19న ప్రవేశించనున్నారు. విజయవాడ పార్లమెంటరీ పరిధిలో నిర్ణయాల్లో లోకేశ్ కీలకంగా మారారు. అభ్యర్ధుల ఎంపిక.. నేతల పని తీరు గురించి ఆరా తీస్తున్నారు.
లోకేశ్ యాత్ర వేళ పార్టీ నేతలు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ లోక్ సభ అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న కేశినేని చిన్ని వేదాద్రి లోని లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని జగ్గయ్యపేట టీడీపీ నాయకులతో ప్రత్యేకంగా పూజలు చేసారు. లోకేశ్ యాత్ర సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. విజయవాడ నగర పరిధిలో సీట్ల కోసం పోటీ కొనసాగుతోంది.

సీట్ల కోసం నేతల పోటీ : టీడీపీ, జనసేన పొత్తు వేళ సెంట్రల్ సీటును బోండా ఉమాకు కేటాయించినట్లు ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో వంగవీటి రాధా జనసేనలో చేరుతారని.. సెంట్రల్ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు గా చెబుతున్నారు. విజయవాడ తూర్పు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ ను తిరిగి సీటు ఖాయమని చెబుతుండగా, గన్నవరం నుంచి బరిలోకి దించుతారనే చర్చ వినిపిస్తోంది.
విజయవాడ పశ్చిమంలో టీడీపీ నేతల మధ్య అనైక్యత ఉంది. దీంతో, పొత్తులో భాగంగా జనసేన విజయవాడ తూర్పు వైపే చూస్తున్నట్లు సమాచారం. సెంట్రల్, తూర్పు స్థానాల పైన జనసేన కోరుతోందని చెబుతున్నారు. దీంతో, లోకేశ్ యాత్ర సమయంలో తమ అభ్యర్ధిత్వం గురించి హమీ పొందేందుకు ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేసారు.












Click it and Unblock the Notifications