గొంతెమ్మ కోరికలా, బీజేపీ రాగాలు: టిడిపి ఫైర్, బాలయ్య ప్రత్యేక ఆకర్షణ

తిరుపతి: మహానాడు వేదిక పైన కేంద్రం తీరు పైన టిడిపి నేతలు కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన నేపథ్యంలో తాము ఏపీకి గొంతెమ్మ కోరికలు కోరడం లేదని కేంద్రానికి షాకిచ్చే కామెంట్స్ చేశారు. టిడిపి విప్ కాల్వ శ్రీనివాసులు మహానాడు వేదిక పైన మాట్లాడారు.

పోలవరం వ్యయాన్ని కేంద్రమే భరించాలన్నారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అనేక ప్రాజెక్టులు నిర్మిస్తోందన్నారు. చంద్రబాబును విమర్శఇంచే నైతికత ఏ పార్టీకి లేదన్నారు. విభజన హామీలను కేంద్రం నెరవేర్చాలన్నారు. పల్లె విభజన హామీల పైన మహానాడులో తీర్మానం ప్రవేశ పెట్టారు.

TDP leaders target BJP in Mahanadu

కేంద్రం నుంచి నుంచి ఏపీకి సాయం సరిగా అందడంలేదని మరో నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఏపీకి సాయంపై బీజేపీ చింతామణిలా రాగాలు తీస్తోందన్నారు. విద్యా సంస్థల ఏర్పాటుకు రూ.9వేల కోట్లు అవసరమైతే రూ.135 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు.

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మహానాడు ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలో నటిస్తున్న బాలయ్య సినిమా కోసం మార్చుకున్న లుక్‌లోనే ఆయన వచ్చారు. అందరిలాగా ఆయన కూడా సభ్యత్వం నమోదు చేసుకున్నారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. మహానాడు తిరుమల పుణ్యక్షేత్రంలో జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+