మంత్రి రజనీకి సీటు పక్కానా, టీడీపీ అభ్యర్ధి ఫిక్స్ - గెలిచేదెవరు..!?
వై నాట్ 175. సీఎం జగన్ ఈ ఎన్నికలకు ఫిక్స్ చేసిన టార్గెట్. ఇప్పటికే నియోజవకర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక కసరత్తు ప్రారంభించారు. పలు మార్గాల్లో సర్వేలు చేయిస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు. సర్వేల్లో వెనుకబడి ఉన్న అభ్యర్ధులకు ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ పని తీరు మెరుగు పర్చుకోవాలని సూచనలు చేసారు. ఇక, ఇప్పుడు మంత్రుల్లో తిరిగి సీట్లు దక్కేదెవరికి..వారి గెలుపు అవకాశాల పైన చర్చ మొదలైంది. అందులో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ నియోజకవర్గం పైన కొత్త చర్చ మొదలైంది.

మంత్రి రజనీ నియోజకవర్గంలో : మరో తొమ్మది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. సీఎం జగన్ సింగిల్ గానే ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అమరావతి జిల్లాల్లో టీడీపీ ఈ సారి ఆశలు పెట్టుకుంది. దీంతో..అమరావతి పరిధిలో సీఎం జగన్ వైసీపీ అభ్యర్ధుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
మంగళగిరి, తాడికొండ తో పాటుగా గుంటూరు..క్రిష్ణా జిల్లాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. గుంటూరు జిల్లా నుంచి ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో మంత్రి రజనీ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి అనూహ్యంగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పైన విజయం సాధించారు. కేబినెట్ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు.
రజనీకి సీటు ఖాయమా : వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు మంత్రి రజనీ ఇప్పటికే సిద్దం అవుతున్నారు. అక్కడ వైసీపీ నుంచి రజనీకి సీటు ఖాయమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వంలో మంత్రిగా.. పార్టీ వ్యవహారాల్లోనూ రజనీ యాక్టివ్ గా ఉండటంతో మరోసారి సీటు ఖాయమని తెలుస్తోంది. ఇందు కోసం రజనీ మరోసారి గెలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అక్కడ టీడీపీలో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటు న్నాయి.
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మరోసారి ఇదే సీటు నుంచి తనకు సీటు వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. బాష్య ప్రవీణ్ అనే రియల్ వ్యాపారి ఇప్పుడు చిలకలూరి పేటలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. లోకేశ్ పేర్లతో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తున్నారు. తాజాగా జరిగిన మహానాడులోనూ పార్టీకి పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చారు. బాష్యం ప్రవీణ్ కు సీటు ఖరారు అనే ప్రచారం పైన తాజాగా ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు.

టీడీపీ అభ్యర్ధిత్వం కోసం పోటీ : ఎన్నికల ముందు సేవా కార్యక్రమాలు చేసి ఎంతో కొంత ఖర్చు చేస్తే సీటు వస్తుందా అని ప్రశ్నించారు. బాష్యం ప్రవీణ్ కు అసలు చిలకలూరిపేటకు ఏంటి సంబంధమని నిలదీసారు. ఈ తరహా వ్యాఖ్యలపైన పార్టీ చీఫ్ చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీ నిర్ణయాలకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో..ప్రత్తిపాటి పుల్లారావు తిరిగి పార్టీలో అభ్యర్ధులను చంద్రబాబు ఖరారు చేస్తారని..
పార్టీ అధ్యక్షుడి నిర్ణయం ఎవరైనా కట్టుబడాల్సిందేనని చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా భాష్యం ప్రవీణ్ కు సీటు ఖాయమనే ప్రచారం సాగుతోంది. దీంతో..ఎలాగైనా గెలవాలని మంత్రి రజనీ టీడీపీలో జరుగుతున్న పరిణామాలను తనకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, ఇక్కడి రాజకీయం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications