ఏపీ.. శ్రీలంక అయిపోదా బాబూ?: వైసీపీ కౌంటర్ అటాక్
అమరావతి: మహానాడులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఎన్నికల తొలి విడత మేనిఫెస్టోపై విమర్శలు మొదలయ్యాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదురుదాడికి దిగారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న నవరత్నాలపై గతంలో చంద్రబాబు చేసిన విమర్శలను గుర్తు చేస్తోన్నారు. ఆల్ ఫ్రీ చంద్రబాబు అంటూ సెటైర్లు సంధిస్తోన్నారు.
మహానాడు వేదికపై నుంచి చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే మహాశక్తి, యువగళం, ఇంటింటికీ మంచినీరు, పూర్ టు రిచ్, అన్నదాత, బీసీలకు రక్షణ చట్టం.. పేర్లతో కొత్త పథకాలను ప్రవేశపెడతానంటూ మహానాడు వేదికగా ప్రకటించారు. మహిళల స్వయం సమృద్ధి, యువతకు ఉపాధి కల్పించడాన్ని తన బాధ్యతగా తీసుకుంటానని చెప్పారు.

ఇందులో భాగంగా తల్లికి వందనం పేరుతో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలను తల్లుల అకౌంట్‌లో జమ చేస్తానని, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరినీ ఉచితంగా చదివిస్తానని హామీ ఇచ్చారు. మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తానని, దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తానని చెప్పారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు చంద్రబాబు. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకూ అన్నదాత పథకం కింద ఏడాదికి 20,000, యువగళం కింద ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామని అన్నారు. ఇంటింటికీ కుళాయి ద్వారా మంచినీటిని సరఫరా చేస్తామని తేల్చి చెప్పారు.
చంద్రబాబు ఇచ్చిన ఈ హామీలపై వైఎస్ఆర్సీపీ నాయకులు ఎదురుదాడి చేస్తోన్నారు. 2014 నాటి ఎన్నికల్లో రైతులకు సంపూర్ణ రుణమాఫీ అంటూ మోసం చేశాడని, అధికారంలోకి వచ్చిన తరువాత లక్షన్నర రూపాయలకే పరిమితం చేశాడని గుర్తు చేస్తోన్నారు. చంద్రబాబు ఆల్ ఫ్రీ ఇస్తామని చెప్పినా ప్రజలు ఆయనను నమ్మే పరిస్థిితి లేదని తేల్చి చెప్పారు.
అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు ఎక్కడ అమలు చేయమంటారేమోననే కారణంతో 2014 నాటి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను సైతం మాయం చేసిన ఘనత చంద్రబాబు, టీడీపీ నాయకులకు ఉందని, ఇప్పుడు అల్ ఫ్రీ హామీలతో మేనిఫెస్టో ప్రకటించారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. దీన్ని మాయాఫెస్టోగా అభివర్ణించారు. ఈ మాయాఫెస్టోలో ఎవరు పడబోరని అన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాలపై చంద్రబాబు, టీడీపీ నాయకులు ఎన్నో విమర్శలు చేశారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పప్పు బెల్లాల్లా పంచి పెడుతున్నారని, ప్రజలను సోమరిపోతులను చేస్తోన్నారని చంద్రబాబు విమర్శించారని, ఇప్పుడు ఆయన చేస్తోందేమిటని ప్రశ్నించారు. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ గురించి నీచాతినీచంగా మాట్లాడాడని గుర్తు చేశారు.
రాష్ట్రాన్ని దివాళా తీయిస్తోన్నాడని, శ్రీలంకగా మారుస్తున్నాడంటూ చంద్రబాబు తమ ప్రభుత్వాన్ని విమర్శించారని, ఇప్పుడు చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో ద్వారా అవే పరిస్థితులు రాష్ట్రంలో ఉత్పన్నం కావా? అని నిలదీశారు. జగన్ అమలు చేస్తోన్న ప్రతి పథకాన్ని తాము అమలు చేస్తామని చంద్రబాబే స్వయంగా చెబుతున్నప్పుడు ప్రజల మనస్సుల్లో జగన్‌కు స్థానం ఉన్నట్టే కదా అని పేర్కొన్నారు.
-
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications