వేటకొడవళ్లతో విరుచుకుపడ్డారు: అనంతలో భగ్గుమన్న టీడీపీ-వైసీపీ ఫైట్

Subscribe to Oneindia Telugu

అనంతపురం: అనంతలో టీడీపీ-వైసీపీ మధ్య మరోసారి ఫ్యాక్షన్ తరహా కక్షలు బయటపడ్డాయి. ఫ్లెక్సీల ఏర్పాటులో తలెత్తిన వివాదం వేటకొడవళ్లతో దాడి చేసుకునేదాకా వెళ్లడంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది.

టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తలపై దౌర్జన్యానికి పాల్పడినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో వేటకొడవళ్లు, రాడ్లతో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి పాల్పడినట్లుగా సమాచారం. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనానంతరం క్షతగాత్రులను ధర్మవరం ఆసుపత్రికి తరలించారు.

TDP members attack on YSRCP members in anantapuram

అయితే గాయపడిన నలుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రస్తుతం వారిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. వైసీపీకి అనుకూలంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకే తమపూ టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడినట్లుగా బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా వైసీపీ నేతలు దాడిని తీవ్రంగా ఖండించారు.

ఇక ఈ దాడిలో టీడీపీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతల దాడిని ప్రతిఘటించే క్రమంలో వైసీపీ నేతలు దాడి చేయడంతో వారు గాయపడినట్లు సమాచారం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Flexi controversy leads to fight between ruling and opposition parties in Anantapuram. YSRCP members were attaked by tdp while arranging flexis
Please Wait while comments are loading...