షాక్: డబ్బులు పంచుతూ చిక్కిన బాలకృష్ణ, పరిశీలిస్తున్న ఈసీ

ప్రముఖ సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉపఎన్నిక నేపథ్యంలో నంద్యాలలో బుధవారం ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.

కర్నూలు: ప్రముఖ సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉపఎన్నిక నేపథ్యంలో నంద్యాలలో బుధవారం ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని నంద్యాల ప్రజలను కోరారు.

బాలకృష్ణ సంచలనం

బాలకృష్ణ సంచలనం

కాగా, నంద్యాల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో బాలకృష్ణ ఓటర్లకు డబ్బులు పంచుతుండగా మీడియా కంటికి చిక్కారు. ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారింది. బహిరంగంగానే ఇలా బాలకృష్ణ డబ్బులు పంచడంతో నలువైపుల నుంచి విమర్శలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Recommended Video

    Nandyal By Polls : Balakrishna Money Distributing To Voters Viral In Social Media | Oneindia Telugu
    సోషల్ మీడియాలో వైరల్..

    సోషల్ మీడియాలో వైరల్..

    అంతేగాక, బాలకృష్ణ డబ్బులు పంచిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, బాలకృష్ణ డబ్బులు పంచుతున్న సమయంలో ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ రోడ్ షోలో మాట్లాడుతుండటం గమానర్హం. బాలకృష్ణ డబ్బులు పంపిణీ విషయం ఎన్నికల కమిషన్(ఈసీ) దృష్టికి వెళ్లింది.

    ఈసీ దృష్టికి..

    ఈసీ దృష్టికి..

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలను ఈసీ, పలువురు ముఖ్య అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇలా టీడీపీ నేతలు డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు.

    అభిమానిపై చేయి చేసుకుని..

    అభిమానిపై చేయి చేసుకుని..

    ఇది ఇలా ఉండగా, బాలకృష్ణ బుధవారం తన రోడ్ షో అనంతరం ఓ హోటల్లో బస చేయడానికి వెళ్లారు. అక్కడికి ఫొటోలు దిగేందుకు చాలా మంది అభిమానులు వచ్చారు. కాగా, ఓ అభిమాని ఫొటో దిగేందుకు ముందుకు రావడంతో బాలకృష్ణ అతనిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన కూడా బాలకృష్ణపై విమర్శలకు అవకాశం ఇచ్చింది.

    వైసీపీపై విమర్శలు..

    వైసీపీపై విమర్శలు..

    అన్ని రంగాల్లో టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంటే ప్రతిపక్షం కుట్రలు, కుతంత్రాలు పన్నుతోందని బాలయ్య తన రోడ్ షోలో అన్నారు. నంద్యాలలో కీలక నేతలైన భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి తనపై ఎంతో ఆదరాభిమానాలను చూపారని గుర్తు చేశారు. భూమా అంటే ధీమా అనే రీతిలో ఆయన ఎదిగారన్నారు. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం సినీ హాస్యనటుడు వేణుమాధవ్‌ మాట్లాడుతూ ..బాలకృష్ణ అభిమాన సంఘం కార్యదర్శి అయిన జగన్మోహన్‌ రెడ్డి టీడీపీకి విస్తృత ప్రచారం చేస్తున్నారని, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ రోడ్ షోలో కార్యక్రమంలో మంత్రులు భూమా అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా మౌనిక తదితరులు పాల్గొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+