Bhuma Akhilapriya: కుప్పకూలిన భూమా అఖిలప్రియ..! ఆస్పత్రికి తరలింపు..!

ఏపీలో ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇవాళ ఉన్నట్లుండి కుప్పకూలిపోయారు. తన నియోజకవర్గంలోని ఓ జాతరలో ఉత్సాహంగా పాల్గొంటున్న సమయంలో ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అఖిలప్రియ అస్వస్థతకు గురయ్యారన్న వార్తతో భూమా అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

ఆళ్లగడ్డలోని దొర్నిపాడు మండలం డబ్ల్యూ.గోవిందిన్నె గ్రామంలో వెలసిన శ్రీ మూల పెద్దమ్మ తల్లి దేవర సందర్భంగా ప్రజలు ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ మెడికల్ క్యాంపు, వచ్చిన ప్రజలకు వసతి అన్నింటిని పరిశీలించడం జరిగిందంటూ తాజాగా అఖిలప్రియ ట్వీట్ చేశారు. అనంతరం ఇవాళ జరిగిన గరుడ దీపం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గరుడ దీపం మోసిన తర్వాత ఆమె ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో ఆమెను అక్కడే ఉన్న అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.

tdp mla bhuma akhilapriya collapsed during jathara in allagadda shifted to hospital

ఏపీలో ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇవాళ ఉన్నట్లుండి కుప్పకూలిపోయారు. తన నియోజకవర్గంలోని ఓ జాతరలో ఉత్సాహంగా పాల్గొంటున్న సమయంలో ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అఖిలప్రియ అస్వస్థతకు గురయ్యారన్న వార్తతో భూమా అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇవాళ ఆళ్లగడ్డలోని దోర్నిపాడు మండలం డబ్ల్యూ గోవిందిన్నెలో జరిగిన మూల పెద్దమ్మ దేవరలో అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్క గరుడ దీపాన్ని కూడా ఆమె మోశారు. గరుడ దీపం మోసిన తర్వాత ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బీపీ పెరగడంతో ఆమె స్పృహ తప్పిపడిపోయారు. దీంతో అఖిలప్రియను వెంటనే అంబులెన్స్‌లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రికి భారీగా అభిమానులు చేరుకుంటున్నారు. గతేడాది ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి గెలిచిన భూమా అఖిలప్రియ ఆ తర్వాత జోష్ మీద కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు తన ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతూ, హెచ్చరికలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తన ప్రత్యర్థుల్ని పార్టీలో చేర్చుకుంటే సహించేది లేదని ఏకంగా టీడీపీ అధిష్టానానికి సైతం అఖిల తాజాగా హెచ్చరికలు పంపారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.

గతేడాది ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి గెలిచిన భూమా అఖిలప్రియ ఆ తర్వాత జోష్ మీద కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు తన ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతూ, హెచ్చరికలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తన ప్రత్యర్థుల్ని పార్టీలో చేర్చుకుంటే సహించేది లేదని ఏకంగా టీడీపీ అధిష్టానానికి సైతం అఖిల తాజాగా హెచ్చరికలు పంపారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+