కడప గడ్డపై నారా లోకేష్- గంటా శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు..!!

కడప: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ్టికి 117వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ పాదయాత్ర కడప జిల్లాలో కొనసాగుతోంది. కడప అసెంబ్లీ నియోజకవర్గం మీదుగా సాగుతున్నారాయన. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం మీదుగా నారా లోకేష్ కడపలో అడుగుపెట్టారు.

కడప శివార్లలోని ఆలంఖాన్ పల్లి వద్ద 1,500 కిలోమీటర్ల మైలురాయిని అందుకున్నారు. అక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కడపలో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. మురుగునీటి బెడద నుంచి విముక్తి కల్పిస్తానని అన్నారు. యువగళం సాక్షిగా ప్రమాణం చేస్తోన్నానని పేర్కొన్నారు.

 Ganta Srinivas

నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర 1,500 కిలోమీటర్లను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని టీడీపీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కుప్పంలో ఒక్కడిగా మొదలై కోట్లాది మందికి చేరువై విజయవంతంగా ఈ పాదయాత్ర సాగిపోతోందని పేర్కొన్నారు. అయిదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో మహోజ్వలంగా కడప శివారు అలంఖాన్ పల్లె వద్ద 1500 కిలోమీటర్లను పూర్తి చేసుకుందని అన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంచుకోటగా చెప్పుకొనే కడపలో దారి పొడవునా వివిధ వర్గాల ప్రజలు జన సముద్రాన్ని తలపించేలా నారా లోకేష్‌కు ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నారని గంటా శ్రీనివాస్ అన్నారు. అడుగు పెట్టిన ప్రతీ చోటా ప్రజలకు భరోసా కల్పిస్తూ, అడుగడుగునా అన్ని వర్గాల వారినీ కలుస్తూ వారి కష్టాలను అడిగి తెలుసుకుంటోన్నారని వ్యాఖ్యానించారు. సాయం కోసం వచ్చిన వారిని నిరాశపరచట్లేదని అన్నారు.

 Ganta Srinivas

రాయలసీమ సమగ్ర అభివృద్ది కోసం యువత ఆలోచనలు, అభిప్రాయాలు, మనోభావాలను నేరుగా వాట్సాప్ నెంబర్ ద్వారా తెలుసుకునే ప్రయత్నానికి నారా లోకేష్ తెర తీశారని, యువ హృదయ నేతగా నిలిచారని పేర్కొన్నారు. యువత, మహిళలు, రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, వివిధ సామాజికవర్గాల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేస్తూ వారికి భరోసా ఇస్తోన్నారని గంటా శ్రీనివాస్ అన్నారు.

అధికారంలోకి వస్తే ఆయా వర్గాలకు తాము ఏం చేస్తామనేది స్పష్టం చేస్తూ ముందుకెళుతున్నారని, కాళ్లకు బొబ్బలు వచ్చినా, వాటిని సైతం లెక్కచేయకుండా ముందుకు సాగిపోతూ 1,500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో అతలాకుతలమైన రాష్ట్రాన్ని మళ్లీ దేశంలో అగ్రగామిగా, సస్యశ్యామలంగా, పూర్వవైభవాన్ని తేవాలన్న లక్ష్యంతో ప్రారంభమైనా ఈ యువగళం ఇప్పుడు అయిదు కోట్ల మంది జనగళంగా మారిందని కితాబిచ్చారు గంటా శ్రీనివాస్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+