సమస్య సృష్టించి పరిష్కరించినట్లు జగన్ బిల్డప్ రాజకీయాలు: సినిమా టికెట్లపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల సమావేశం పై టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సమస్యలు ఉద్దేశపూర్వకంగా సృష్టించి, మళ్లీ ఆ సమస్యలు పరిష్కరించినట్టుగా బిల్డప్ రాజకీయాలు చేస్తున్నారని గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆరోపణలు గుప్పించారు. అసలు రాష్ట్రంలో సినిమా టికెట్ల వివాదం సృష్టించిందే వైసీపీ సర్కార్ అని ఆయన పేర్కొన్నారు.

సినిమా టిక్కెట్ల రేట్లు ఎవరు తగ్గించమన్నారు? ఎవరు పెంచామన్నారు?
సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసలు ఎవరు సినిమా టిక్కెట్ల రేట్లు ఎవరు తగ్గించమన్నారు? ఎవరు మళ్లీ పెంచామన్నారు? వైయస్ జగన్ అంటూ ఏపీ సీఎం వైయస్ జగన్ కు ప్రశ్నలు సంధించారు. మీరే సమస్యను సృష్టించి మీరే పరిష్కరించి నట్టు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం మీకే చెల్లింది అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. జగన్ మార్క్ డైవర్షన్ పాలిటిక్స్ ఇవి అని మండిపడ్డారు. జగన్ ఒక ఫెయిల్డ్ సీఎం గా మిగిలిపోయారని పేర్కొన్నారు.

ఉపన్యాసాలు బాగా చెప్పే మంత్రి ఏమైనట్లో: బుగ్గనపై సెటైర్లు
ఇదే సమయంలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పై కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి సెటైర్లు వేశారు. అప్పుల ఊబిలో రాష్ట్రం ఉంటే ఆర్థిక మంత్రి గారి జాడ మాత్రం కనిపించడం లేదు అని పేర్కొన్నారు.ఉపన్యాసాలు బాగా చెప్పే మంత్రి ఏమైనట్లో అంటూ ఎద్దేవాచేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి .బుగ్గన గారు అసలు మీరు ఢిల్లీ వెళ్ళేటప్పుడు మీరు తీసుకెళ్లే శాలువాలు,మొమెంటో ల లెక్కలు అయిన సరిగ్గా రాసుకుంటున్నారా.కబోర్డులు సరిపోవు మళ్ళీ బుగ్గన రాజా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

జగన్ తో సినీ ప్రముఖుల భేటీ .. పలు కీలక అంశాలపై చర్చ
ఇదిలా ఉంటే గురువారం నాడు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో దర్శకుడు రాజమౌళి, కొరటాల శివ, హీరోలు ప్రభాస్, మహేష్ బాబు, నటుడు ఆలీ, పోసాని కృష్ణమురళి తదితరులు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టాలీవుడ్ లో నెలకొన్న పలురకాల సమస్యలపై వారి ఏపీ ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేశారు. ఇక ఇదే సమయంలో టికెట్లు అంశంపైన కూడా చర్చించారు. చిన్న పెద్ద సినిమాలకు న్యాయం జరిగేలా మంచి పాలసీ తీసుకొచ్చేందుకు కొద్దిరోజుల తర్వాత చేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా ఒకే టికెట్లను ఆన్లైన్ పద్ధతిలో విక్రయించాలని సీఎం జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సీఎంతో భేటీ అనంతరం వారం పది రోజుల్లో ఏపీ టికెట్ల రేట్లు అంశంపై శుభవార్త అందుతుందని టాలీవుడ్ ప్రముఖులు వెల్లడించారు.

సినిమా టికెట్ల ధరల పై ఈనెల 17వ తేదీన కమిటీ భేటీ
తాజా పరిణామాల నేపథ్యంలో సినిమా టికెట్ల ధరల పై ఈనెల 17వ తేదీన కమిటీ భేటీ కానుంది. కమిటీ సభ్యులకు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ భేటీలో సినీ ప్రముఖులు చేసిన సిఫార్సులపై చర్చించనున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. టికెట్ ధరలు, అదనపు షోలు, భారీ బడ్జెట్ చిత్రాల వంటి అంశాలపై చర్చ జరగనున్నట్లు గా తెలుస్తుంది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మీకు అర్థమవుతోందా?.. ‘ధురంధర్2’ తీయడం వెనక పక్కా రాజకీయ వ్యూహం -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే? -
దయచేసి నన్ను సినిమాల్లో పెట్టుకోండి: రాజశేఖర్ రిక్వెస్ట్ -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న సినిమా.. హీరో కూడా లేడు !! -
థియేటర్ల దగ్గర తొలిసారిగా 144 సెక్షన్, భారీగా పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు ఈ హీరో సినిమాకే












Click it and Unblock the Notifications