AP Half Day Schools : ఏపీలో ఒంటిపూట బడులు ఎందుకు పెట్టరు ? జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే లేఖ
అమరావతి : ఏపీలో వేసవి సెగలు కక్కుతోంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయినా స్కూళ్లకు ఒంటిపూట సెలవులు మాత్రం ఇవ్వడం లేదు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఏటా ఫిబ్రవరి 15 తర్వాత ఎప్పుడైనా ఒంటిపూట సెలవులు ఇచ్చేసేవారు. కానీ ఈసారి మాత్రం ప్రభుత్వం ఎందుకో మౌనం వహిస్తోంది. దీనిపై తాజాగా విద్యామంత్రి బొత్సను ప్రశ్నించిన టీచర్లకు సెలవులు మీకా, విద్యార్ధులకా అనే ఎదురు ప్రశ్న ఎదురైంది.
ఏపీలో స్కూళ్లకు ఒంటిపూట సెలవులు ప్రకటించకపోవడంపై టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఇవాళ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయని, భానుడి ప్రతాపానికి బయటకు రావాలంటే పెద్దవాళ్లే భయపడుతున్నారని అనగాని తెలిపారు. అలాంటిది చిన్న పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ స్కూల్లో ఎలా ఉండగలరని ప్రశ్నించారు. మార్చి నెల ముగుస్తున్నా రాష్ట్రంలో ఒంటిపూట బడులు పెట్టకపోవడం ఏమాత్రం సమంజసం కాదనే విషయాన్ని గుర్తుచేశారు.

అకడమిక్ క్యాలెండర్ ప్రకారం మార్చి మొదటి లేదా రెండో వారంలో ఒంటిపూట బడులు పెట్టడం దశాబ్ధాలుగా అమలవుతోందని అనగాని తెలిపారు. కానీ మార్చి నెలాఖరు దాటిపోతున్నా ఒంటిపూట బడులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడం ఒక్క రాజారెడ్డి రాజ్యాంగంలోనే సాధ్యమవుతోందన్నారు. ఉపాధ్యాయులపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఒంటిపూట బడులకు ఎగనామం పెట్టారని స్పష్టంగా అర్ధమవుతోందన్నారు. విద్యార్థులపై కోపాన్ని అభం శుభం తెలియని చిన్నారులపై చూపిస్తారా అని నిలదీశారు.
ఎండలకు పిల్లలు అస్వస్థతకు లోనయ్యే ప్రమాదం ఉందనే కారణంగా హాఫ్ డే స్కూల్స్ పెడుతున్నారని, దాన్ని మీరు ఎలా ఆపేస్తారని ప్రశ్నించారు. ఏప్రిల్ నెల రానే వస్తోందని, ఇంకెప్పుడు పెడతారు ఒంటిపూట బడులని ప్రశ్నించారు. పైగా దీనిపై ప్రశ్నించిన ఉపాధ్యాయులపై విద్యామంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేయడం సిగ్గుచేటన్నారు. ఒంటిపూట బడులు పిల్లలకా? మీకా అంటూ టీచర్లను మంత్రి చులకనగా మాట్లాడటం నీతిమాలినచర్య అన్నారు. ఏసీ రూముల్లో, ఏసీ కార్లలో తిరిగే ముఖ్యమంత్రి, మంత్రులకు స్కూలు పిల్లల కష్టాలు ఏం తెలుస్తాయన్నారు.
అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఒక్క బడినైనా పూర్తిస్థాయిలో సందర్శించారా? పిల్లల ఇబ్బందులు తెలుసుకున్నారా? అని టీడీపీ ఎమ్మెల్యే అనగాని ప్రశ్నించారు. పట్టుమని పదిరోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించమంటే అన్ని రోజులు మా వల్ల కాదని వైసీపీ నేతలు కళ్లు తేలేస్తారన్నారు. చిన్నపిల్లలు మాత్రం మండే ఎండల్లో రోజంతా స్కూళ్లలో ఉండాలా అని అడిగారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉపాధ్యాయులపై కక్షసాధింపు ధోరణి పక్కనపెట్టాలని, విద్యార్థుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని కోరారు.
-
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications