నందమూరి కుటుంబానికి, పరిటాల కుటుంబం అనుబంధం గుర్తు చేసిన సునీత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కుమారుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణకు మాజీ మంత్రి పరిటాల రవి కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని, ఆ బంధం చాలా సంవత్సరాలు కొనసాగిందని అనంతపురం జిల్లాలోని రాప్తాడు టీడపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు.

నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి, టీడపీ ఎమ్మెల్యే పరిటాల సునీత అనంతరం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ నందమూరి హరికృష్ణతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. నందమూరి హరికృష్ణ, తన భర్త పరిటాల రవి సొంత సోదరులా కలిసి మెలిసి ఉండేవారని పరిటాల సునీత గుర్తు చేశారు.

TDP MLA Paritala Sunitha said that Nandamuri Harikrishna is very close to our family

తన భర్త పరిటాల రవి చనిపోయిన తర్వాత కూడా నందమూరి హరికృష్ణ మా కుటుంబంతో చాలా అన్యోన్యంగా ఉన్నారని, మా కుటుంబం గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునే వారని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత గుర్తు చేసుకున్నారు. ఆనాడు ఎన్టీఆర్ తలపెట్టిన ప్రజా చైతన్య యాత్ర రథానికి రథసారధిగా వ్యవహరించిన హరికృష్ణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారని పరిటాల సునీత ఇదే సందర్బంలో గుర్తు చేశారు.

అప్పట్లో రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి నందమూరి హరికృష్ణ ఎంతో కష్టపడి పని చేశారని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత గుర్తు చేసుకున్నారు. అలాంటి మంచి వ్యక్తి హరికృష్ణ అని, ఆయన మనందరికీ దూరం కావడం చాలా బాధాకరంగా ఉందని, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు.

TDP MLA Paritala Sunitha said that Nandamuri Harikrishna is very close to our family

నందమూరి హరికృష్ణ ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవ చేయడానికి మా కుటుంబం, టీడీపీ కార్యకర్తలు కలిసి పని చేస్తామని రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో పేద ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి మా నాయకుడు చంద్రబాబు శక్తి వంచన లేకుండా పని చేస్తారని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+