ముగిసిన వివాదం: వంశీని 2గం.లు నిలబెట్టారు, నేడు వెళ్లిపోమన్నారు! అందుకే కంటతడి

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, సీఎంవో అధికారి మధ్య బుధవారమే వివాదం సమసిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో వంశీ సచివాలయానికి వెళ్లారు.

అమరావతి: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, సీఎంవో అధికారి మధ్య బుధవారమే వివాదం సమసిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో వంశీ సచివాలయానికి వెళ్లారు. ప్లానింగ్ అధికారి బోర్డు వైస్ చైర్మన్ కుటుంబరావు వద్ద పంచాయతీ జరిగింది. బాపులపాడు మండలంలోని చెరుకు మొత్తాన్ని కేసీపీకీ ఇవ్వాలని నిర్ణయించారు.

చదవండి: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే వంశీ, రాజీనామా!: అసలేం జరిగింది?

మిగతా ప్రాంతంలోని చెరుకును ఆంధ్రా షుగర్స్‌కు తరలించాలని అంగీకారం తెలిపారు. చాగల్లులోని షుగర్ ఫ్యాక్టరీని కేసీపీ స్వాధీనం చేసుకునే వరకు అక్కడ పండించే చెరుకు ఆంధ్రా షుగర్‌కే తరలించేందుకు ఒప్పుకున్నారు.

చదవండి: అది కూడా తెలియదా: పోసానికి లోకేష్ కౌంటర్, బాలకృష్ణ-కులంతో టీడీపీకి ఝలక్

ఏం జరిగిందంటే.. అధికారులు ఇలా

ఏం జరిగిందంటే.. అధికారులు ఇలా

అంతకుముందు వంశీ వివాదంపై అధికారులు వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. డెల్టా షుగర్స్ మూసివేయడంతో రైతులు పండించిన పంటలను ఎవరికి అమ్మాలనే అంశంపై సీఈవోలను పిలిపించి అధికారులు చర్చించారు. సీఎంవోలో డెల్టా షుగర్స్, ఆంధ్రా షుగర్స్ కేసీపీ షుగర్స్ ప్రతినిధులు ఉన్నారు.

సమావేశ మందిరంలోకి రావడంతో వెళ్లిపోమన్నారు

సమావేశ మందిరంలోకి రావడంతో వెళ్లిపోమన్నారు

ఆ సమయంలో ఎమ్మెల్యే వంశీ సమావేశం హాలులోకి వచ్చారు. దీంతో అధికారులు ఆయనను బయటకు వెళ్లాలని సూచించారు. సోమవారం సాయంత్రం రైతుల సమస్యలను వంశీ చెప్పారని, గంటన్నరపాటు విన్నామని చెబుతున్నారు. వంశీ కోరిక మేరకు షుగర్ ఫ్యాక్టరీల సీఈవోలతో సమావేశం జరిపామని, డెల్టా షుగర్స్‌లో పంట ఎవరికి అమ్మాలనే అంశంపై చర్చించామన్నారు.

గతంలోను రెండు గంటలపాటు నిలబెట్టారు

గతంలోను రెండు గంటలపాటు నిలబెట్టారు

శనివారం కూడా సమస్యల పరిష్కారం కోసం వస్తే వంశీని అధికారులు రెండు గంటల పాటు నిలబెట్టిన్లుగా తెలుస్తోంది.
అయినా అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు సమావేశ మందిరంలోకి వెళ్తే మీకు సంబంధం లేదు వెళ్లిపోమన్నారు. దీంతో మనస్తాపానికి గురైన వంశీ కంటతడి పెట్టారు. దీంతో ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఎమ్మెల్యే బోడెప్రసాద్ దానిని లాక్కొని చించేశారు. లోకేష్ రంగంలోకి దిగి వంశీని చల్లబరిచారు. అనంతరం సమస్య కూడా తీరింది.

డెల్టా షుగర్స్ మూసివేతతో ఆందోళన

డెల్టా షుగర్స్ మూసివేతతో ఆందోళన

డెల్టా షుగర్స్ మూసివేతతో పంటను ఎవరికి అమ్మాలో తెలియక రైతులు ఆందోళనకు గురయ్యారు. ఆ కర్మాగారం పరిధిలో ఉన్న రైతుల బాధ్యతను సీఎం చంద్రబాబు.. వంశీకి అప్పగించారు. ఈ ప్రాంతాన్ని దక్కించుకునేందుకు ఆంధ్రా షుగర్స్, కేసీపీలు పోటీపడ్డాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+