సీఎం జగన్ కు సిద్ధంగా ఉన్న రిటర్న్ గిఫ్ట్??
రాబోయే ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు 13.35 లక్షల మంది ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు అన్నారు. ఉద్యోగులు ఇవ్వబోయే ఈ రిటర్న్ గిఫ్ట్‌ను సకల సలహాదారులు, పోలీసులు ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 10 శాతం మంది ఉద్యోగులకు కూడా లబ్ధి జరగలేదని విమర్శించారు.
Recommended Video
ఎన్నికల ప్రచారంలో సీపీఎస్ రద్దుచేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి.. మడమ తిప్పిన ముఖ్యమంత్రి జగన్ పోలీసుల సహాయంతో ఉద్యోగులపై నిర్బంధకాండ జరిపారంటూ ధ్వజమెత్తారు. ఉద్యోగులు కోరుకునే న్యాయబద్ధమైన డిమాండ్లకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. దేశ స్వాతంత్య్ర సమరం కోసం క్విట్ ఇండియా ఉద్యమం ఏ తరహాలో సాగిందో అదే తరహాలో ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల పోరాటం జరుగుతోందని అభివర్ణించారు.

ఉద్యోగుల శక్తి ముందు పోలీసుల శక్తి సరిపోదన్నారు. తాత్కాలికంగా ఉద్యోగులతో సమ్మెను విరమింపచేయగలరేమోకానీ వారి సంకల్పశక్తిని మాత్రం మార్చలేరని అశోక్‌బాబు అన్నారు. సెప్టెంబరు ఒకటో తేదీన తాడేపల్లిలోని సీఎం ఇంటిని ముట్టడించేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు మిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చారు. అయితే పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఉద్యోగులను నిర్బంధం చేస్తుండటంతో మిలియన్ మార్చ్‌ను వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications