ప్రత్యేకహోదా: బానిస బతుకులే, హీరోయిన్ల వెంటే, సినిమాలను అడ్డుకొంటాం: రాజేంద్రప్రసాద్ సంచలనం

అమరావతి: ప్రత్యేక హోదా విషయమై సినీ నటులు ఎందకు స్పందించడం లేదని టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. అవార్డులు రాకపోతే గొడవలు చేసే సిని నటులు ఏపీ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఎందుకు నోరు తెరవడం లేదో చెప్పాలని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.

మంగళవారం నాడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటులపై టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీకి నష్టం వాటిల్తుతున్నా నటులు ఎందకు స్పందించరని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రానికి న్యాయం కోసం పోరాటం చేయాలని సినీ నటులను టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ కోరారు. రాష్ట్ర ప్రజలంతా పోరాటం చేస్తోంటే నటులు ఎందుకు పోరాటం చేయరని ఆయన విమర్శలు చేశారు.

 హలీవుడు నటులు కాదు

హలీవుడు నటులు కాదు

ఏపీలో ఉన్న తెలుగు సినీ నటులు హలీవుడ్ స్థాయి నటులు కాదని టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు సినీ నటులకు పట్టవా అని ఆయన ప్రశ్నించారు.సినిమా అవార్డులు రాకపోతే గందరగోళం సృష్టించే కళాకారులు, నటులు ఏపీకి అన్యాయం జరిగితే ఎందుకు నోరు తెరవడం లేదని ఆయన ప్రశ్నించారు.

 సినిమా ప్రదర్శనలను అడ్డుకొంటాం

సినిమా ప్రదర్శనలను అడ్డుకొంటాం

సినీ నటులకు ఆదాయం, సినిమా కలెక్షన్లు, ఆస్తులే ముఖ్యమా అని టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు రాష్ట్రం గురించి పట్టదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో తమతో కలిసి పోరాటం చేయాలని రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. తమిళ నటులను చూసి నేర్చుకోవాలని రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.

 కెసిఆర్ కుటుంబం మద్దతిచ్చింది

కెసిఆర్ కుటుంబం మద్దతిచ్చింది

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌కు తెలంగాణ సీఎం కెసిఆర్ కుటుంబం కూడ మద్దతిచ్చిన విషయాన్ని టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ గుర్తు చేశారు. హైద్రాబాద్‌లోనే ఇంకా బానిస బతుకులు బతుకుతున్న మీరంతా ఎందుకు ప్రత్యేక హోదాకు మద్దతివ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. హైద్రాబాద్‌లో ఉంటూ ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతిస్తే ఇబ్బందులు ఎదురౌతాయని భయపడుతున్నారా అని రాజేంద్ర ప్రసాద్ అడిగారు.

 హీరోయిన్ వెంటపడే క్యారెక్టర్లకే పనికోస్తారు

హీరోయిన్ వెంటపడే క్యారెక్టర్లకే పనికోస్తారు

హలీవుడ్ స్థాయి నటులు ఏపీలో లేరని టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చెప్పారు. హీరోయిన్ల వెంట పడే క్యారెక్టర్లకే పనికొస్తారని రాజేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు. వయస్సు అయిపోయిన నటులకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా అంటూ ప్రశ్నించారు. ఏపీకి ఇంత అన్యాయం జరుగుతున్నా ఎందుకు నోరు తెరవడం లేదో చెప్పాలని రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు.

అవార్డుల కోసం ఆందోళనలు

అవార్డుల కోసం ఆందోళనలు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలంతా ఆందోళనలు చేస్తోంటే సినీ నటులు హైద్రాబాద్‌లో ఏసీ రూమ్‌ల్లో కూర్చొన్నారని టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. అవార్డులు రాకపోతే నానాయాగీ చేసే సినీ నటులు ఎందుకు ప్రత్యేక హోదాపై నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా పక్కరాష్ట్రంలోని నటులను చూసి బుద్ది తెచ్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+