సారీ అండి.. ఏమీ అనుకోవద్దు... కొత్తవారికి అవకాశం ఇవ్వాలిగా..??
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం ఒక్కటే తెలుగుదేశం పార్టీ ముందున్న ఆప్షన్. అందుకే ప్రతి అవకాశాన్ని చంద్రబాబు సద్వినియోగం చేసుకోవడంతోపాటు పార్టీ బలహీనతలను, తన బలహీనతలను కూడా అధిగమిస్తూ వస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. తనకు ఎంత క్లోజ్ గా ఉన్నప్పటికీ టికెట్ల దగ్గరకు వచ్చేసరికి గెలుపు గుర్రమైతేనే కేటాయిస్తున్నారు.. లేదంటే నో టికెట్.

అసెంబ్లీతోపాటు లోక్ సభ చాలా ముఖ్యం..
అసెంబ్లీతోపాటు లోక్ సభపై పూర్తిగా దృష్టిపెట్టిన చంద్రబాబు 25 నియోజకవర్గాలకు ఆర్థిక బలం, అంగబలం ఉన్నవారిని ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. ఏలూరు నుంచి మాగంటి బాబు 2009 ఎన్నికల నుంచి వరుసగా పోటీచేస్తూ వస్తున్నారు.
గెలిచింది మాత్రం 2014లోనే. కాంగ్రెస్ పార్టీనుంచి ఎమ్మెల్యేగా దెందులూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మాగంటి బాబు తెలుగుదేశం పార్టీలో చేరిన 2009 ఎన్నికల్లో కావూరి సాంబశివరావు చేతిలో ఓటమిపాలయ్యారు. 2014లో ప్రస్తుత జనసేన నాయకుడు తోట చంద్రశేఖర్ పై భారీ మెజారిటీతో మాగంటి విజయం సాధించారు. తిరిగి 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లోఆయన ఓటమి తేడా1.65 లక్షలుగా ఉంది.

కుమారుల మరణంతో కుంగిపోయిన బాబు
మాగంటి ఏడాది కాలంలో తన ఇద్దరు కుమారులను కోల్పోయారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్న మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ, రెండో కుమారుడు రవీంద్రనాథ్ చౌదరి.. ఇద్దరూ కొద్దినెలల వ్యవధిలోనే కన్ను మూశారు.
మానసికంగా కుంగిపోవడంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తారనుకున్నప్పటికీ కొద్ది నెలలుగా పార్టీ కార్యకర్తలకు, కార్యక్రమాలు నిర్వహిస్తూ నియోజకవర్గ పరిధిలో కలియదిరుగుతున్నారు. నియోజకవర్గ పరిధిలో గ్రూపులు కట్టేవారికి ఆయన హెచ్చరికలు జారీచేస్తున్నారు. అయితే పార్టీ అధినేత చంద్రబాబు మాగంటి విషయంలో మరో ఆలోచన చేస్తున్నారు. ఆయన సేవలను పార్టీకి ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.

కొత్తవారికి అవకాశం ఇద్దామని..
కొత్తనేతలకు అవకాశం ఇద్దామనే యోచనలో ఉన్న చంద్రబాబు ఇటీవల జరిపిన పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన మాజీ మంత్రికి చంద్రబాబు సూచనలు చేశారు. అలాగే ఆయన్ను పిలిపించి చెప్పబోతున్నారు. మాగంటిని దాదాపుగా పక్కన పెట్టినట్లేనని, ఆయన స్థానంలో మాగంటి బాబు సమీప బంధువు కొమ్మారెడ్డి రాంబాబు పేరు ప్రముఖంగా వినపడుతోంది.
ఆయన నాయకత్వంపై అధినేత పూర్తి నమ్మకంతో ఉన్నారు. రాంబాబుతోపాటు మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామయ్య మనవడు రాజీవ్ కూడా సీటు ఆశిస్తున్నప్పటికీ 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన యాక్టివ్ గా లేరు. మరోవైపు మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు పేరు కూడా ఏలూరు స్థానానికి వినపడుతోంది.
-
మండలిలో 'చీకటి' రోజు.. బయటపడ్డ వైసీపీ అరాచకాలు! -
సాష్టాంగ ప్రణామం.. ఆంధ్రుల ఆత్మగౌరవానికి దక్కిన విజయం -
Amaravati Bill: అమరావతి గొంతుకనవుతా..! సాయిరెడ్డి బిగ్ ట్విస్ట్..! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
అమరావతిపై జగన్ ప్లాన్ 'బీ' - కొత్త రాజధాని “మావిగన్”..!! -
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సీరియస్-తక్షణం..! -
అమరావతి బిల్లు పై పార్లమెంట్ లో వైసీపీ బిగ్ ట్విస్ట్..!! -
ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
అమరావతిపై జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్.. అంగుళం కూడా కదల్చలేవ్ -
జగన్ 'మావిగన్' ప్రతిపాదన వెనుక, కూటమి నేతలకు చంద్రబాబు కీలక పిలుపు..!! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!!











Click it and Unblock the Notifications