టీడీపీ ఎంపీ కేశినేని నానికి కరోనా పాజిటివ్... తనను కలిసినవాళ్లంతా టెస్టులు చేయించుకోవాలని సూచన...
టీడీపీ ఎంపీ కేశినేని నాని కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం తన నివాసంలో క్వారెంటైన్‌లో ఉన్నారు. ఇటీవల తనను కలిసినవారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని... ఐసోలేషన్‌లోకి వెళ్లాలనని సూచించారు. ఈ మేరకు కేశినేని నాని ట్విట్టర్ ద్వారా ఈ విషయాలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 5,086 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 9,42,135కి చేరింది. మరో 14 మంది కరోనాతో మృతి చెందగా... ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 9,03,072కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,710 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,741 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 1,55,70,201 కరోనా టెస్టులు చేశారు.
Dear all, I've tested positive for #COVID19 today with mild symptoms. I have quarantined myself at home and am taking all the necessary precautions. I would request all those who came in contact with me to isolate and get themselves tested at the earliest
— Kesineni Nani (@kesineni_nani) April 16, 2021
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్ పర్యవేక్షణకు సంబంధించి ప్రత్యేక అధికారుల కమిటీని నియమించింది. ఇందులో 21మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ అధికారులు ఉన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు కృష్ణబాబు, రవిచంద్ర ,మల్లికార్జున్ , శ్రీకాంత్ ,పీయూష్ కుమార్, బాబు, విజయరామరాజు , అభిషేక్ మహంతిలను కమిటీలో నియమించింది. రాష్ట్రంలో కరోనా కట్టడికి అవసరమైన చర్యలు,వ్యాక్సినేషన్ పంపిణీని ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర,ఛత్తీస్‌గఢ్,ఉత్తరప్రదేశ్,కర్ణాటక,కేరళ,మధ్యప్రదేశ్,రాజస్తాన్,గుజరాత్,తమిళనాడు,ఆంధ్రప్రదేశ్‌లలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటికే జనతా కర్ఫ్యూ విధించగా... ఢిల్లీలోనూ వీకెండ్ కర్ఫ్యూ అమలుచేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో సండే లాక్‌డౌన్ ప్రకటించారు. శనివారం రాత్రి 8గంటల నుంచి సోమవారం ఉదయం 7గంటల వరకు లాక్‌డౌన్ అమలులో ఉండనుంది. కేవలం అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతినిచ్చారు.












Click it and Unblock the Notifications