సీఎం విజయ్ బర్త్ డే వేళ ఘోర విషాదం.. ఏడుగురు మృతి, 40 మందికి సీరియస్

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పెరియపాలయంలోని ఓ ప్రైవేట్ ఎక్స్ పోర్ట్ సీ ఫుడ్ యూనిట్ లో ప్రమాదవశాత్తు అమ్మోనియా గ్యాస్ లీకై ఏడుగురు కార్మికులు మృతి చెందారు. మరో 40 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసుల సమాచారం ప్రకారం ఫ్యాక్టరీ పరిసరాల్లో అసోం, ఒడిషా, జార్ఖండ్ నుంచి వచ్చిన దాదాపు 120 మంది కార్మికులు నివసిస్తున్నారు. ఇవాళ ఆదివారం సెలవు కావడంతో వాళ్లంతా తమ ఇళ్లలోనే ఉన్నారు. దాంతో చాలామంది అస్వస్థతకు గురయ్యారు.

పెరియపాలయంలోని సెయింట్ పీటర్స్ పాల్ సీఫుడ్స్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ లో అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. ఆ తర్వాత వేగంగా చుట్టుపక్కల ప్రాంతాలకు గ్యాస్ వ్యాప్తి చెందింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళా కార్మికులు చికిత్స పొందుతూ మృతి చెందారని పోలీసులు, జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. చాలా మందికి ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా మారిందని.. మరికొంతమందికి ముక్కులు, చెవుల నుంచి రక్తం వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికి ఏడుగురు మృతి చెందగా.. మరో 9 మంది పరిస్థితి సీరియస్ గా ఉందని తెలిపారు.

AmmoniaLeak Tamil Nadu Ammonia Gas Leak Tragedy 7 Dead 40 Critical CM Vijay Issues Strong Orders

ఇక జిల్లా అధికార యంత్రాంగం అభ్యర్థన మేరకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. 30 మందితో కూడిన బృందం గ్యాస్ డిటెక్షన్ డివైజెస్, ఇతర రెస్క్యూ ఆపరేషన్ లను నిర్వహిస్తోంది. ఈ ఘటనపై పెరియపలాయం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అమ్మోనియా గ్యాస్ లీక్ ఘటనపై సీఎం విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్య సహాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు కోసం 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+