ఢిల్లీలో మాగుంటకు ఆ పదవి ఆఫర్

Magunta Sreenivasulu Reddy: పలు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలకు ఛైర్మన్లు అపాయింట్ అయ్యారు. దాదాపుగా అన్ని శాఖలు, విభాగాలపై ఏర్పాటైన స్థాయీ సంఘాలకు అధిపతులు నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రెటేరియట్ ఓ నోటిఫికేషన్ జారీ చేసింది.

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉంటోన్న తెలుగుదేశం పార్టీ.. కీలక కమిటీ లభించింది. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలపై ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ టీడీపీలో ఖాతాలో పడింది. దీనికి ఒంగోలు లోక్‌సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

TDP MP Magunta Sreenivasulu Reddy gets the Standing Committees on Housing and Urban Affairs

వాణిజ్యం- డోలా సేన్ (తృణమూల్ కాంగ్రెస్), విద్య, మహిళలు, శిశు, యువజన వ్యవహారాలు- దిగ్విజయ్ సింగ్ (కాంగ్రెస్), ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం- రామ్ గోపాల్ యాదవ్ (సమాజ్‌వాది పార్టీ), న్యాయ వ్యవహారాలు, పబ్లిక్ గ్రీవెన్సులు- బ్రిజ్ లాల్ (బీజేపీ), సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులు- భువనేశ్వర్ కళిత (బీజేపీ) నియమితులయ్యారు.

రవాణా, పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాలు- సంజయ్ కుమార్ (జేడయూ), వ్యవసాయం, పశుసంవర్ధకం, ఫుడ్ ప్రాసెసింగ్- చరణ్‌జీత్ సింగ్ ఛన్నీ (కాంగ్రెస్), కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్- కీర్తి ఆజాద్ (తృణమూల్ కాంగ్రెెస్), బొగ్గు, గనులు, ఉక్కు- అనురాగ్ ఠాకూర్ (బీజేపీ) అపాయింట్ అయ్యారు.

ఐటీ- నిషికాంత్ దూబే (బీజేపీ), ఆహారం, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాలు- కణిమోళి (డీఎంకే), రక్షణ- రాధా మోహన్ సింగ్ (బీజేపీ), ఇంధనం- శ్రీరంగ్ అప్పచందు బెర్నె (శివసేన), విదేశీ వ్యవహారాలు- శశిథరూర్ (కాంగ్రెస్), ఆర్థికం- భతృహరి మెహతాబ్ (బీజేపీ)ను కేంద్రం నియమించింది.

కార్మిక వ్యవహారాలు, టెక్స్‌టైల్స్, స్కిల్ డెవలప్మెంట్- బసవరాజ్ బొమ్మై (బీజేపీ), పెట్రోలియం, సహజవాయువులు- సునీల్ దత్తాత్రేయ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ), గ్రామీణాభివృద్ది, పంచాయతీ రాజ్- సప్తగిరి శంకర్ ఉళక (కాంగ్రెస్), సామాజిక న్యాయం, సాధికారత- పీసీ మోహన్ (బీజేపీ), జలవనరులు- రాజీవ్ ప్రతాప్ రూఢీ (బీజేపీ) నియమితులు అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+