వర్మకు అదే ధ్యాస, సహకరించాలి: శివప్రసాద్, బహిరంగ చర్చకు సిద్దమేనా?:బిజెపి

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: పార్లమెంట్ ఎదుట ఆందోళన చేస్తున్న తమపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చేసిన విమర్శలపై చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కౌంటరిచ్చారు. ఈ సమస్యను తీసుకొని రామ్‌గోపాల్ వర్మ ఫోకస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని శివప్రసాద్ ఆరోపించారు. ఆంధ్రప్రజల ఆత్మగౌరవం కోసం ఆందోళన చేస్తున్న తమకు మద్దతివ్వకుండా విమర్శలు చేయడం సరైందికాదని శివప్రసాద్ అభిప్రాయపడ్డారు.

  TDP MP's Are Jokers

  కేంద్ర బడ్జెట్‌లో ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో ఏపీకి చెందిన ఎంపీలు పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే టిడిపి ఎంపీల నిరసన ఫోటోను ట్యాగ్ చేస్తూ రామ్‌గోపాల్ వర్మ విమర్శలు గుప్పించారు. ఎంపీలను జోకర్లుగా అభివర్ణించారు.

  ఈ విమర్శలపై చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఆక్షేపించారు. ఈ రకమైన విమర్శలను మానుకోవాలని శివప్రసాద్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు సూచించారు. ఓ తెలుగు మీడియా ఛానెల్‌తో శివప్రసాద్ రామ్ గోపాల్ వర్మ విమర్శలకు కౌంటరిచ్చారు.

  ఫోకస్ అయ్యేందుకు రామ్‌గోపాల్ వర్మ ప్రయత్నం

  ఫోకస్ అయ్యేందుకు రామ్‌గోపాల్ వర్మ ప్రయత్నం

  ఎప్పుడూ ఏదో ఒక అంశాన్ని తీసుకొని వార్తల్లో ఉండాలనే తాపత్రయం దర్వకుడు రామ్‌గోపాల్ వర్మకు ఉందని చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌కు విమర్శించారు. ఆంధ్ర్ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలనే డిమాండ్‌తో తాము ఆందోళన సాగిస్తున్న తరుణంలో తమకు సహకరించకుండా విమర్శలు గుప్పించడాన్ని శివప్రసాద్ తప్పుబట్టారు. ఈ సమస్యను తీసుకొని ఫోకస్ అయ్యేందుకు రామ్‌గోపాల్ వర్మ ప్రయత్నిస్తున్నారని శివప్రసాద్ అభిప్రాయపడ్డారు.

  మార్చిలోనే బిజెపి పొత్తుపై స్పష్టత, ఏపీపై కేంద్రం చిన్న చూపు: కేశినేని సంచలనం

  ఏపీ సమస్యలను దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్ళాం

  ఏపీ సమస్యలను దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్ళాం

  ఏపీ ప్రజలకు ఎన్నికల సమయంలో బిజెపి ఇచ్చిన హమీని పార్లమెంట్ వేదికగా దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్ళామని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అభిప్రాయపడ్డారు. తమ సమస్యను తెలుసుకొన్న ఇతర పార్టీల ఎంపీలు కూడ మద్దతిచ్చిన విషయాన్ని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ గుర్తు చేశారు.వెంకన్న, దుర్గమ్మ సాక్షిగా మోడీ ఏపీ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చలేదని శివప్రసాద్ చెప్పారు. ఏపీ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తమను జోకర్లుగానో, ఇంకో రకంగానో విమర్శలు చేసినా నష్టం లేదన్నారు.

  బాబు ఉండగా జెఎసి ఎందుకు, కేంద్రం మాటలను నమ్మేది లేదు: కేశినేని సంచలనం

  టిడిపి నేతలు బహిరంగ చర్చకు రావాలి

  టిడిపి నేతలు బహిరంగ చర్చకు రావాలి

  ఏపీ రాష్ట్రానికి కేంద్రం నుండి వచ్చిన నిధుల విషయంలో బహిరంగ చర్చకు రావాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్ కిషోర్ సవాల్ విసిరారు. ఏపీ రాష్ట్రానికి ఏ మేరకు నిధులిచ్చారనే విషయమై ఏపీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు , విశాఖ ఎంపీ వివరించినా , టిడిపి నేతలు ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో చెప్పాలని శ్యామ్ కిషోర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు పోలవరం ప్రాజెక్టును ఏపీకి అప్పగించినట్టు ఆయన చెప్పారు.

  శుభవార్త: ఎంపీల నిరసనలతో దిగొచ్చిన కేంద్రం, లోటు భర్తీకి సిద్దం

  రాజకీయ అవసరాల కోసమే విమర్శలు

  రాజకీయ అవసరాల కోసమే విమర్శలు

  రాజకీయ అవసరాల కోసమే బిజెపిపై టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్ కిషోర్ అభిప్రాయపడ్డారు. మిత్రధర్మాన్ని టీడీపీ నాయకులు పాటించకుండా బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ఇచ్చిన రూ.లక్ష కోట్ల లెక్కలు టీడీపీ నాయకులు చెప్పడానికి తాము సిద్దంగా ఉన్నామని చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telugu Desam Party (TDP) Member of Parliament (MP), Siva Prasad, brushed aside tweets by director Ram Gopal Varma that they were jokers, by stating only a joker in a pack can save a player. Even audience in circus remember joker and their tricks.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి