ఇక పవన్ కళ్యాణ్ వర్సెస్ టీడీపీ!: చిరు మాటేమిటో.. సాయంత్రం కౌంటర్!!
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు కౌంటర్ ఇవ్వనున్నారు. ప్రత్యేక హోదా విషయమై ఏపీ ఎంపీలు మాట్లాడటం లేదని సోమవారం ప్రెస్ మీట్లో చెప్పిన పవన్ వారిపై మండిపడ్డారు.
ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని నానిలు సాయంత్రం ఐదు గంటలకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇవ్వనున్నారు. ఆంధ్రా ఎంపీలంతా వ్యాపారులని పవన్ చులకన మాట్లాడారని టీడీపీ ఎంపీలు భావిస్తున్నారు. దీనిపై సాయంత్రం కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
Photos: పవన్ ప్రెస్ మీట్ ; ఈ రోజు కార్టూన్
మద్దతిచ్చినంత మాత్రాన పవన్ కళ్యాణ్ విమర్శిస్తే సహించేది లేదని చెబుతున్నారు. రాష్ట్ర విభజన బిల్లు పెట్టిన సమయంలో చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్న విషయాన్ని పవన్ గుర్తు పెట్టుకోవాలని టీడీపీ చెబుతోంది. పవన్ కళ్యాణ్ తన వైఖరి మార్చుకుంటే మంచిదని చెబుతున్నారు.

ఓటుకు నోటు, సెక్షన్ 8, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బాగానే స్పందించారని భావిస్తున్న టీడీపీ నేతలు ప్రత్యేక హోదా విషయంలో మాత్రం తమను టార్గెట్ చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
ముఖ్యంగా.. వ్యాపారాలు చేసుకోవడానికే పదవా, అయితే రాజీనామా చేయండి అంటూ ఘాటుగా పవన్ వ్యాఖ్యానించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తమకు మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్‌కు, టీడీపీకి ఇక వార్ ప్రారంభమైనట్లుగానే పలువురు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications