జగన్ కేసు వేగవంతంకోసం ఢిల్లీలో టిడిపి ఎంపీల మకాం

జగన్ ఆస్తుల కేసు విషయమై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌ను(సివిసి) కలిసిన అనంతరం ఖమ్మం ఎంపి నామా నాగేశ్వర రావు మాట్లాడారు. జగన్ కేసు దర్యాఫ్తును వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. హవాలా మార్గంలో నల్లధనంపై ఆరోపణలు వస్తే ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి) ఎలాంటి చర్యలు తీసుకోలేదని తాము సివిసి దృష్టికి తీసుకు వెళ్లామన్నారు.
దర్యాఫ్తును వేగవంతం చేసేందుకు విచారణ అధికారులకు అనుమతి ఇవ్వకపోవడంపై కూడా తాము ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. విచారణలో తేలిన అక్రమాస్తులకు, జప్థు చేసిన ఆస్తులకు ఏమాత్రం పొంతన లేదన్నారు.
విభజనపై కావూరి
రాష్ట్ర విభజన నిర్ణయం వల్ల కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలనడం సరికాదని చెప్పారు. 2009 డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం చేసిన విభజన నిర్ణయం సరైంది కాదని నాడే చెప్పామన్నారు.












Click it and Unblock the Notifications
