Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీతో జట్టు కట్టిన వైసీపీ రెబెల్: లోకేష్‌తో కలిసి ఆందోళన

రాజమండ్రి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.

2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

TDP MPs protest against the arrest of Chandrababu

చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై ఢిల్లీలో జాతీయ నాయకులను కలుస్తోన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. ఇవ్వాళ పార్లమెంట్ భవనానికి వచ్చారు. పార్టీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ ఎంపీలు నిమ్మల కిష్టప్ప, మురళీమోహన్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథితో కలిసి పార్లమెంట్ ఆవరణలో ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు.

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు సైతం వారితో కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయనపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఏపీలో శాంతిభద్రతలు కరవయ్యాయంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.

TDP MPs protest against the arrest of Chandrababu

ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని, అకారణంగా ఆయనను జైల్లో ఉంచారని ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. ఇది అక్రమ అరెస్టేనని, దీనిపై కోర్టుల్లో పోరాడతామని అన్నారు. దీనికి సంబంధించిన న్యాయ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఏపీలో ఏం జరుగుతుందో కేంద్రం గమనించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని పార్లమెంట్ లోపల, బయటా వెలుపల లేవనెత్తుతామని గల్లా జయదేవ్ స్పష్టం చేశారు.

తప్పుడు సాక్ష్యాధారాలతో చంద్రబాబును ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని మరో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైెస్ జగన్మోహన్ రెడ్డి ఓ సైకోలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి, జగన్ ఆయనను కటకటాల వెనక్కి పంపించారని విమర్శించారు. ఈ అంశాన్ని సభలో కూడా లేవనెత్తుతామని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+