Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాబు దెబ్బ, బీజేపీకి షాక్: ప్రకటన చేసినా టిడిపి బెట్టు, అంతా మీ వల్లే.. సోనియాపై ఎంపీల ఆగ్రహం

Recommended Video

    Arun Jaitley On Special Package & Visakha Railway Zone In Rajya Sabha

    న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న టీడీపీ, వైసీపీ ఎంపీలు రెండు రోజులుగా పార్లమెంటు ఉభయ సభల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. లోకసభ, రాజ్యసభలు పలుమార్లు వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్‌లో సభలో కీలక ప్రకటన చేశారు.

    ఈ ప్రకటన టీడీపీ ఎంపీలకు ఏమాత్రం ఊరటనివ్వలేదు. జైట్లీ, గోయల్‌ల ప్రకటనపై టీడీపీ ఎంపీలు అసంతప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అనంతరం తాము తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. కాలపరిమితితో కూడిన ప్రకటన చేసే వరకు తగ్గేది లేదని స్పష్టం చేశారు.

    జైట్లీ, గోయల్‌ల ప్రకటనపై అసంతృప్తి

    జైట్లీ, గోయల్‌ల ప్రకటనపై అసంతృప్తి


    జైట్లీ, గోయల్‌ల ప్రకటన తమకు ఏమాత్రం సంతృప్తికరంగా లేదని టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. ఏపీకి ఇచ్చిన హామీలు ఎప్పటిలోగా అమలు చేస్తారనే విషయమై స్పష్టత కావాలని చెప్పారు. మరోవైపు లోకసభలో ప్రకటన చేయాలని ఎంపీలు డిమాండ్ చేఓశారు. ఇలా ప్రకటన చేస్తే ప్రతి పార్టీ ఆందోళన చేస్తుందని కేంద్రమంత్రులు అన్నారు.

    ఇలా చెబితే ప్రజలు నమ్మరు

    ఇలా చెబితే ప్రజలు నమ్మరు

    ఏపీ ఆర్థిక కార్యదర్శిని పిలిపించి మాట్లాడుతామని కేంద్రమంత్రులు అన్నారు. అయితే, ఏపీకి విభజన సమయంలో ఇచ్చిన హామీల వారీగా ప్రకటన చేస్తేనే ప్రజలు నమ్ముతారని టీడీపీ నేతలు అన్నారు. టెక్నికల్‌గా అంశాలను తెరపైకి తెస్తే ప్రజలు నమ్మరని చెప్పారు.

    మీ వల్లేనంటూ సోనియాపై ఆగ్రహం

    మీ వల్లేనంటూ సోనియాపై ఆగ్రహం

    లోకసభలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ వల్లే ఏపీకి అన్యాయం జరిగిందని మండిపడ్డారు. మల్లికార్జున ఖర్గే ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. సోనియా గాంధీ వద్దకు వెళ్లి మీ వల్లే మాకు అన్యాయం జరిగిందన్నారు. విభజన చట్టాన్ని యూపిఏ సరిగా అమలు చేసి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదన్నారు.

    జైట్లీ ప్రకటన సమయంలో మౌనంగా విజయసాయి రెడ్డి

    జైట్లీ ప్రకటన సమయంలో మౌనంగా విజయసాయి రెడ్డి

    అరుణ్ జైట్లీ ప్రకటన చేసిన సమయంలో రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి మౌనంగా ఉన్నారు. మరోవైపు, సీఎం చంద్రబాబు జిల్లా నాయకులతో టెలి కాన్ఫరెన్స్ రద్దు చేసుకున్నారు. ఢిల్లీ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

    ఫలించిన బాబు వ్యూహం, తగ్గేది లేదు

    ఫలించిన బాబు వ్యూహం, తగ్గేది లేదు


    కాగా, కేంద్రంపై చంద్రబాబు తేవాలనుకున్న ఒత్తిడి కొంతమేర సఫలమైంది. సభలో ప్రకటన చేయడంతో కొంత ఫలించింది. అయితే ఇలాంటి ప్రకటనలు గతంలోను చేశారని, చేతల్లో చూపించాలని చాలామంది అంటున్నారు. అంతేకాదు, అంతకుముందు ఎంపీలతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ ద్వారా.. హామీలు ఇవ్వడం కాదని, లోకసభలో ప్రకటన చేస్తేనే ఆందోళనలు తగ్గించాలని సూచించారు. దీంతో ఎంపీలు అదే మాటపై కూర్చున్నారు. లోకసభలో కాలపరిమితితో కూడిన ప్రకటన చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీని వదులుకోలేని పరిస్థితుల్లో ప్రకటన చేసి ఉంటారని అంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+