చిత్తూరు సబ్ జైలులో నారా లోకేష్!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్ర‌భుత్వ‌మేన‌ని, పోలీసులు ఈ విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. కుప్పంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న ముగిసిన త‌ర్వాత పోలీసులు దాదాపు 60 మంది టీడీపీ నాయ‌కుల‌ను అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. వారిని క‌లిసి మాట్లాడ‌టానికి లోకేష్ చిత్తూరు స‌బ్‌జైలుకు వ‌చ్చారు.

ములాఖ‌త్ ద్వారా వారిని ప‌రామ‌ర్శించారు. న్యాయ‌ప‌రంగా అన్ని విష‌యాల్లోను పార్టీ అండ‌గా ఉంటుంద‌నే హామీనిచ్చారు. చ‌ట్టాన్ని ఉల్లంఘిస్తున్న పోలీసుల‌ను వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని హెచ్చ‌రించారు.

జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత పేద‌ల‌కు అన్నం పెట్టే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్ల‌ను మూసేశార‌ని మండిప‌డ్డారు. రాష్ట్ర‌వ్యాప్తంగా మూత‌ప‌డిన అన్న క్యాంటిన్లు 2010 ఉన్నాయ‌ని, త‌ల్లికి, సోద‌రికి ముద్ద పెట్ట‌ని వ్య‌క్తి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఏవిధంగా పెడ‌తార‌ని ప్ర‌శ్నించారు. పేద‌ల‌కు క‌డుపు నిండా భోజ‌నం లేకుండా వ్య‌క్తి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అంటూ ధ్వ‌జ‌మెత్తారు.

tdp national general secretary nara lokesh comments on cm ys jaganc

మంగ‌ళ‌గిరిలో అన్న క్యాంటిన్ ప్రారంభిస్తే 60 పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్ట్ చేశార‌ని, కుప్పంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న పూర్త‌యిన త‌ర్వాత అన్న‌క్యాంటిన్‌ను ధ్వంసం చేశార‌ని, పేద‌ల‌కు అన్నం పెట్టే ఉద్దేశంతో ఏర్పాటైన భోజ‌న‌శాల‌ల‌ను ఎవ‌రైనా ధ్వంసం చేస్తారా? అంటూ తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+