Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టిడిపి ఎప్పుడు ప్రతీకార చర్యలు చేపట్టలేదు...మంచి పద్దతి కాదు:మంత్రి కాల్వ శ్రీనివాసులు

విజయవాడ:పాత్రికేయుడి జీవితం ,రాజకీయ జీవితం పూర్తిగా భిన్నమైనవని రాష్ట్ర పౌరసమాచార శాఖా మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూపాత్రికేయులందరికి హౌసింగ్ పధకం కింద ఇళ్ల మంజూరు చేయాలన్న నిర్ణయానికి కట్టుబడిఉన్నట్లు తెలిపారు.ఈ వారంలోనే పాత్రికేయుల ఇళ్ల మంజూరుకు సంబంధించి వెబ్ సైట్ ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.విపత్కర పరిస్థితుల్లో ఏర్పడ్డ నవ్యాంధ్ర రాష్ట్రం ఏమవుతుందో అనే ఆందోళన నుండి మనం ఏమైనా చేయగలం అనే నమ్మకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పించారని మంత్రి కాల్వ అన్నారు.

అర్హులందరికీ...పథకాలు

అర్హులందరికీ...పథకాలు

రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రైతు రుణ మాఫీ ,పెన్షన్, రేషన్వంటి పథకాలు అందే విధంగా...వాటన్నింటినీ పారదర్శకంగా అమలు చేస్తున్నామని మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పారు. అలాగే ఏ వ్యవస్థలోనూ అవినీతి, అక్రమాలు లేకుండా అన్ని వ్యవస్థల్లో పధకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని మంత్రి కాల్వ తెలిపారు. రాష్ట్రం లో వివిధ నీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ నీటి సమస్యను సమర్ధంగా ఎదుర్కోగలిగామన్నారు.

నమ్మకంతో...పరిశ్రమలు

నమ్మకంతో...పరిశ్రమలు

విభజన అనంతరం ప్రారంభంలో రాష్ట్రంలో పరిశ్రమలు లేవని...అలాంటి పరిస్థితి నుండి పెట్టుబడులకు కేంద్రంగా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్చి దిద్దారని మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పారు.కియా వంటి ప్రతిష్టాత్మకమైన పరిశ్రమ రాష్ట్రానికి వస్తుందని తాను అనోకోలేదన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు అవలంబిస్తున్న విధానాలపై నమ్మకంతో ఆ పరిశ్రమలు వచ్చాయన్నారు. మొబైల్ ఫోన్ల తయారీ కేంద్రాలు దేశంలోనే మొదటిసారిగా మనం రాష్ట్రంలో ఏర్పాటు చేశారన్నారు.

ప్రతీకార చర్యలు...చేపట్టలేదు

ప్రతీకార చర్యలు...చేపట్టలేదు

రాజకీయయంగా టిడిపి ఎప్పుడు ఆకారణంగా విమర్శలు చేయడం గానీ, అబద్ధాలు ఆడటం వంటివి కానీ చేయలేదని మంత్రి కాల్వ అన్నారు.

రాజశేఖర్ రెడ్డి హయాంలో టిడిపి కార్యకర్తలను 54 మందిని హత్య చేశారని...రాష్ట్రంలో అత్యంత భయానక పరిస్థితులు నెలకొల్పారని చెప్పారు. కానీ టిడిపి ఎప్పుడు ప్రతీకార చర్యలు చేపట్టలేదన మంత్రి కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు.

ఆరోపణలు...మంచిది కాదు

ఆరోపణలు...మంచిది కాదు


టిడిపి ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేవారిని ,ప్రోత్సహించకూడదన్నారు మంత్రి కాల్వ.

పట్టిసీమలో,రాజధాని నిర్మాణంలో ఇష్టం వచ్చినట్లు కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందని నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని మంత్రి కాల్వ శ్రీనివాసులు హితవు పలికారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+