ఎన్నికల బరి నుంచి తప్పుకున్న మహాసేన రాజేష్..!!

ఎన్నికల బరి నుంచి మహాసేన రాజేష్ తప్పుకున్నారు. టీడీపీ తొలి జాబితాలో పీ గన్నవరం అభ్యర్దిగా రాజేష్ ను ప్రకటించింది. రాజేష్ అభ్యర్దిత్వం ప్రకటించిన సమయం నుంచి నిరసనలు మొదలయ్యాయి. గతంలో రాజేష్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు పలు సంఘాలు నిరసనలకు దిగాయి. రాజేష్ కు టికెట్ రద్దు చేయాలని డిమాండ్ చేసాయి. టికెట్ ఖరారు చేసిన పి గన్నవరం పరిధిలోనూ రాజేష్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి.

మహాసేన రాజేష్ సంచలన ప్రకటన చేశారు. పి గన్నవరం టిడిపి అభ్యర్థిగా ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సామాన్యుడికి అవకాశం రాగానే వ్యవస్థ మొత్తం ఏకమైందని వ్యాఖ్యనించారు. కులరక్కసి చేతిలో బలైపోయానని, తన వల్ల పార్టీకి చెడ్డపేరు రావొద్దని మహాసేన రాజేశ్ పేర్కొన్నారు. హిందువుల గురించి రాజేశ్ గతంలో చేసిన వ్యాఖ్యల పైన విశ్వహిందూ పరిషత్, రామసేన వంటి సంఘాలు ఆందోళనకు దిగాయి. విశాఖలో టీడీపీ కార్యాలయాన్ని కొన్ని హైందవ సంఘాలు ముట్టడించి నిరసన నిర్వహించాయి.

TDP P Gannavaram Candidate Mahasena Rajesh drop out form Election Contest

సోషల్ మీడియా వేదిక హిందూ సంఘాలు తప్పు పట్టడంతో తలొగ్గి పోటీ నుంచి తప్పుకుంటున్నానని రాజేష్ వెల్లడించారు. తాజాగా అంబాజీ పేటలో తన అభ్యర్దిత్వం ఖరారైన తరువాత ఏర్పాటు చేసిన సమావేశంలోనూ టీడీపీ, జనసేన శ్రేణులు ఆందోళన చేసాయి. పార్టీ కార్యాలయంలో కుర్చీలను ధ్వంసం చేసాయి. పార్టీ నేత హరీష్ మాథుర్ కారును జనసేన శ్రేణులు ధ్వంసం చేసి రాజేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. రాజేష్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గోకవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. హిందూ సంఘాల నుంచి వస్తున్న అభ్యంతరాలతో ఇప్పుడు మహాసేన రాజేష్ పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో, పీ గన్నవరం లో టీడీపీ కొత్త అభ్యర్దిని ప్రకటించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+