పాదయాత్ర రోజే జగన్‌కు భారీ షాక్.. వ్యూహం రచించిన టీడీపీ

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు పాదయాత్ర రోజే భారీ షాక్ ఇచ్చేందుకు టీడీపీ వ్యూహం రచిస్తోంది. పాదయాత్రతో అధికార పీఠానికి దగ్గరవుదామని వైఎస్ జగన్‌ భావిస్తుంటే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు దూరం అవుతున్నారు.

ఇప్పటికే 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. ఇంకా మరికొంత మంది ఎమ్మెల్యేలు జగన్‌కు షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నాయకులు చెబుతున్నారు.

పాదయాత్ర రోజునే...

పాదయాత్ర రోజునే...

పాదయాత్ర ప్రారంభించే మూహూర్తంలోనే జగన్‌కు గట్టి షాక్ ఇవ్వాలని టీడీపీ వ్యూహరచన చేస్తోంది. ఆ షాక్ వైసీపీ ఎమ్మెల్యేల వలసలేనని టీడీపీ చెప్పకనే చెబుతోంది. దీనికి ముహూర్తం కూడా సరిగ్గా జగన్ పాదయాత్ర ప్రారంభించే 6వ తేదీనే టీడీపీ నాయకులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వైసీపీలో ఆగని వలసలు...

వైసీపీలో ఆగని వలసలు...

నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ నుంచి పలువురు ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరేందుకు ముందుకొచ్చారు. టీడీపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో... నియోజకవర్గాల్లో పరిస్థితులను బేరీజు వేసుకుని కొంతమందిని పార్టీలోకి చేర్చుకోవాలని టీడీపీ అధిష్ఠానం నిర్ణయించుకుంది.

6న ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్?

6న ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్?

వైసీపీ ప్రజాప్రతినిధులకు టీడీపీ కండువా కప్పేందుకు వ్యూహాత్మకంగా ఈ నెల 6వ తేదీని మూహూర్తంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల ఆరో తేదీన వైసీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నా టీడీపీ నేతలు మాత్రం గుంభనంగా వ్యవహరిస్తున్నారు. మంచి రోజు అనే కారణంతో శనివారమే రంపచోడవరం ఎమ్మెల్యే టీడీపీలో చేరారు. మిగిలిన వారు సోమవారం టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వైసీపీ నిర్ణయాన్నే తమకు అనుకూలంగా....

వైసీపీ నిర్ణయాన్నే తమకు అనుకూలంగా....

మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు అనర్హత వేటు వేయలేదనే కారణం చూపిస్తూ.. వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉంది అధికారపక్షం.

జగన్ ను ఇరుకున పడేసే ప్రణాళిక...

జగన్ ను ఇరుకున పడేసే ప్రణాళిక...

టీడీపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించిన వైఎస్ జగన్ కు ఝలక్ ఇచ్చే ప్రయత్నంలో టీడీపీ నేతలు వ్యూహం రచించారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కారానికి చర్చించమని అసెంబ్లీకి పంపితే.. ఏకంగా అసెంబ్లీ సమావేశాలనే బాయ్‌కాట్ చేయటం ఏమిటి? ఇదే విషయాన్ని టీడీపీ ఇప్పుడు ప్రజల్లోకి పంపించనుంది. ఈ విషయంపై ఆ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతోనే మాట్లాడించి జగన్ ను మరింత ఇరుకున పడేసే ప్రణాళిక రచిస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP is planning to give big shock to YCP Chief YS Jagan on his Padayatra day. Jagan is going to start his Padayatra on 6th November. According to the TDP leaders.. the same day some more YCP MLAs are going to join in TDP. Already Rampachodavaram MLA joined in TDP on Saturday itself. TDP leaders telling that on Monday more 6 YCP MLAs are going to join in TDP which will gives a Big shock to YS Jagan.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి