వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆగ్రహం తెప్పించిన జగన్, సీరియస్: ఆస్తుల కేసుపై షాకిచ్చేందుకు టిడిపి రెడీ!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు విషయమై అధికార తెలుగుదేశం పార్టీ సీరియస్‌గా ఉందని వార్తలు వస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు విషయమై అధికార తెలుగుదేశం పార్టీ సీరియస్‌గా ఉందని వార్తలు వస్తున్నాయి. ఓటుకు నోటు పైన జగన్ బెట్టుకు పోతుండటం టిడిపి ఆగ్రహానికి మరింత కారణమైందనే వాదనలు వినిపిస్తున్నాయి.

బీజేపీకి చంద్రబాబు సర్‌ప్రైజ్, ఎదురుతిరిగిన పవన్, జగన్ కార్నర్బీజేపీకి చంద్రబాబు సర్‌ప్రైజ్, ఎదురుతిరిగిన పవన్, జగన్ కార్నర్

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు చేర్చాలని వైసిపి నేత ఆళ్ల నాని కోర్టులో పోరాడుతున్నారు. దీనిపై ఇటీవలే చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబుపై మళ్లీ దర్యాఫ్తు అవసరం లేదని కోర్టు తెలిపింది. అయితే దీనిపై తాను సుప్రీం కోర్టుకు వెళ్తానని ఆళ్ల చెప్పారు.

ఓటుకు నోటులో చంద్రబాబును ఇరికించేందుకు వైసిపి నేత చేస్తున్న ప్రయత్నాలు టిడిపి ఆగ్రహానికి గురయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఆస్తుల కేసు పైన దృష్టి సారిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ys jagan

జగన్ ఆస్తుల కేసు ప్రస్తుతం ముందుకు కదలినట్లుగా కనిపించడం లేదని, ఈ కేసు విషయమై మెతక వైఖరి కనిపిస్తోందని టిడిపి భావిస్తోంది. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోందని తెలుస్తోంది. ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో మిత్రపక్షం ఉంది.

అయినప్పటికీ జగన్ కేసు విషయమై తెలుగుదేశం పార్టీ పెద్దగా ఆలోచించలేదని అంటున్నారు. గతంలోనే టిడిపి - కాంగ్రెస్ పార్టీలు కలిసి తన పైన అక్రమంగా కేసులు వేశారని జగన్ చెబుతున్నారు. ఇప్పుడు మరోసారి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే విమర్శలకు తావీయకుండా టిడిపి దూరంగా ఉందని చెబుతున్నారు.

బలం లేకున్నా, పరిటాల సునీత దౌర్జన్యం చేయాలని..: డిజిపికి జగన్ లేఖబలం లేకున్నా, పరిటాల సునీత దౌర్జన్యం చేయాలని..: డిజిపికి జగన్ లేఖ

అయితే, ఓటుకు నోటు పైన వైసిపి.. చంద్రబాబును ఎలాగైనా ఇరికించే ప్రయత్నాలు చేయడం టిడిపి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. ఇప్పుడు టిడిపి తన వైఖరి మార్చుకుందట. దీంతో ఇప్పుడు జగన్ ఆస్తుల కేసు పైన దృష్టి పెట్టాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

చంద్రబాబును ఇరికించాలని ప్రయత్నిస్తున్న వైసిపి అధినేత జగన్ పైన ఇప్పటి వరకు పాటించిన సహనానికి స్వస్తి చెప్పి ఇక తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా టీడీపీ ముఖ్యనేతలు చెబుతున్నారని వార్తలు వస్తున్నాయి.

చంద్రబాబును దొంగలా: వెల్లంపల్లి షాకింగ్ కామెంట్స్, ఏపీ బీజేపీ నేతల పైనా..చంద్రబాబును దొంగలా: వెల్లంపల్లి షాకింగ్ కామెంట్స్, ఏపీ బీజేపీ నేతల పైనా..

పార్టీ ప్రతినిధి బృందాన్ని కేంద్రం వద్దకు పంపి ఆయనపై నమోదైన కేసుల విచారణ తీరుపై నిరసన తెలపాలని నిర్ణయించారట. జగన్ కేసుల విషయంలో సీబీఐ గట్టి ప్రయత్నాలు చేయడం లేదని, కాంగ్రెస్ హయాంలో ఆగిపోయిన సీబీఐ దర్యాప్తులో మళ్లీ కదలిక లేదని టీడీపీ చెబుతోంది. 2004 తర్వాత పెరిగిన జగన్ వ్యక్తిగత ఆస్తులపైనా సీబీఐ విచారణ పూర్తిచేయలేదని ఆరోపిస్తోంది.

English summary
TDP plans to send a team to Delhi on YS Jagan assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X