SIR: మోడీ పెట్టిన తలనొప్పి..! ఎస్ఐఆర్ పై పేర్ని నాని ఫైర్..!
రాష్ట్రంలో ఈ నెలలో ప్రారంభం కాబోతున్న ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ (SIR) రాజకీయ పార్టీలకు తలనొప్పిగా మారింది. విదేశీయుల గుర్తింపు కోసం జరుగుతున్న ఈ ప్రక్రియలో భాగంగా మళ్లీ ఓటర్ల జాబితాలన్నీ సవరించడం, ఓట్లు కోల్పోయిన వారిని తిరిగి జాబితాల్లో చేర్పించడం పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. అయితే దీన్ని సీరియస్ గా తీసుకోకపోతే మాత్రం వచ్చే ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉండటంతో తప్పనిసరిగా ఓటర్ల మ్యాపింగ్ కు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై పేర్ని నాని (Perni Nani) సంచలన వ్యాఖ్యలు చేశారు.
"2002 ఓటర్ల లిస్ట్ లో లేని ప్రతీ ఓటరుకూ వాళ్ల రక్త సంబంధీకులతో మ్యాపింగ్ చేసుకోవాలట, మోడీకి ఓ పిచ్చి ఏంటంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చి ఎవరో ఇక్కడ ఉంటున్నారని, వాళ్లకు ఓటు లేకుండా చేసేయాలని ఇలాంటి ఆలోచనలతో లేకపోతే మన దగ్గర పాకిస్తానోళ్లు, బంగ్లాదేశ్ వాళ్లు ఎక్కడున్నారు అసలు" అని పేర్ని నాని మండిపడ్డారు. సెల్ ఫోన్ లో సిమ్ కార్డుకు సైతం వేలి ముద్ర వేయించుకుంటూ ఓటుకు మాత్రం ఎందుకు పెట్టరని ఆయన ప్రశ్నించారు. వేలి ముద్ర ఉంటే తప్ప ఓటు రాదని చెప్పలేరా అని అడిగారు. ఆధార్ కార్డు ఇస్తారు కానీ అది మాత్రం పనికి రాదంట, పార్లమెంట్ లో చట్టం మాత్రం చేయరు, బీజేపీ దీనిపై స్పందించాలన్నారు.

సుప్రీంకోర్టు ఎన్నికల కమిషనర్లను నియమించాలంటే ప్రధాని, సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్, విపక్ష నేత కలిపి చేయాలని చెప్తే మోడీ ప్రభుత్వం ఆదరాబాదరాగా చట్టం చేసి జడ్డి గారిని తప్పించేసిందన్నారు. దీని కోసం మాత్రం హడావిడిగా చట్టాలు మార్చేస్తారు.
లేకపోతే ఇంత మందికి ఇన్ని బాధలు ఎందుకు, మనల్ని కాల్చుకు తింటానికి తప్ప మరేమీ కాదన్నారు. ఇప్పటికి ఏపీలో 4 కోట్ల 16 లక్షల ఓట్లు ఉంటే 2 కోట్ల 80 లక్షల ఓట్లకు మాత్రమే మ్యాపింగ్ చేసారు. ఐదో తేదీ తర్వాత ఇక 2002 ఓటరు లిస్ట్ లో లేని వారికి మ్యాపింగ్ చేయడం ఆపేస్తారన్నారు. ఆరో తేదీన ఎన్యుమరేషన్ ఫారాలు ప్రింట్ చేస్తారన్నారు. అందులో బీఎల్వో మ్యాపింగ్ చేసి ఉంటే కలర్ ఫోటో, సంతకం పెడితే సరిపోతుందన్నారు. జూలై 21న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తారని, అందులో పేరు లేకపోతే కలెక్టర్ దగ్గరికి వెళ్లి వాదించుకోవాలన్నారు.














Click it and Unblock the Notifications