IRCTC బంపరాఫర్.. తక్కువ ఖర్చులోనే రామేశ్వరం, అరుణాచలం, కన్యాకుమారి టూర్..!

తమిళనాడులో అనేక టూరిస్ట్ ప్రాంతాలు ఉన్నాయి. అలాగే అనేక పుణ్యక్షేత్రాలకు నెలవుగా తమిళనాడు ఉంది. రామేశ్వరం, అరుణాచలం, మధురై, చిదంబరం లాంటి ప్రసిద్ధమైన ఆలయాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. అయితే భక్తుల కోసం ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్ పేరు దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం, చిదంబరం అనే ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ ఖర్చుతోనే తమిళనాడులోని ప్రముఖ పుణ్య క్షేత్రాలను చుట్టేసి వచ్చే విధంగా ఈ టూర్ ను ప్లాన్ చేసింది. ఈ టూర్ మొత్తం 8 రాత్రులు, 9 పగళ్లపాటు కొనసాగనుంది.

సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఈ భారత్​ గౌరవ్​ టూరిస్ట్ రైలు ప్రారంభం అవుతుంది. తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణం సాగుతుంది. రాత్రంతా ప్రయాణం తర్వాత ఉదయం 8 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటారు. హోటల్ లో చెకిన్ తర్వాత స్వామివారిని దర్శించుకుని రాత్రికి అరుణాచలంలోనే బస చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి చిదంబరం వెళ్తారు. అక్కడ నటరాజస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. తిరిగి తిరుచిరాపల్లికి చేరుకుని రాత్రికి అక్కడే స్టే చేస్తారు.

TamilNadu Tour of holy sites IRCTC s bumper offer at a low cost IRCTC South India Tour details

మరుసటి రోజు శ్రీరంగంలోని రంగనాథ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత తంజావూరు బృహదీశ్వరాలయాన్ని విజిట్ చేస్తారు. ఆ తర్వాత రామేశ్వరం వెళ్తారు. రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత ఇతర ఆలయాలను దర్శించుకుంటారు. రాత్రి అక్కడే స్టే చేసి.. ఉదయం మధురై చేరుకుని మధుర మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తారు. అలా సాయంత్రం కన్యాకుమారికి వెళ్తారు. అనంతరం తిరిగి సికింద్రాబాద్ కు తిరుగు ప్రయాణం మొదలుపెడతారు.

మరుసటి రోజు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం 9281030714 నెంబర్ ను సంప్రదించవచ్చు. జూలై 20 నుంచి ఈ టూర్ ప్రారంభం కానుంది. జూలై 29 నాటికి పూర్తి అవుతుంది. ఆసక్తి కలిగిన భక్తులు వెంటనే పైన ఇచ్చిన ఫోన్ నెంబర్ కు సంప్రదించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+