మావిగాన్ ను జనాల్లోకి తీసుకెళ్తున్న టీడీపీ..! పేర్ని నాని షాకింగ్..!

ఏపీలో అమరావతి రాజధాని స్ధానంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ పై కూటమి నేతలు బూతుపురాణాలు,వ్యక్తిగత దాడులకు దిగడంపై మాజీ మంత్రి పేర్ని నాని (perni nani) ఫైర్ అయ్యారు. చంద్ర‌బాబు అనాలోచిత నిర్ణ‌యాలు, అంతులేని అవినీతి, అత్యాశ‌ల‌ కార‌ణంగా అమ‌రావ‌తి రాష్ట్రానికి మోయ‌లేని గుదిబండగా మారిందన్నారు. రాజ‌ధాని నిర్మాణం పేరుతో ఆంధ్ర‌ రాష్ట్రాన్ని చంద్ర‌బాబు దివాళా తీయించే మార్గంలోకి న‌డిపిస్తున్నాడని విమర్శించారు.

వైయ‌స్ జ‌గ‌న్ మావిగ‌న్ ప్ర‌తిపాద‌నను ఎందుకు తిర‌స్క‌రిస్తున్నారో ఇంత‌వ‌ర‌కు కూట‌మి నాయకులు చెప్ప‌లేక‌పోయారన్నారు. నేరుగా స‌మాధానం చెప్పుకోలేక మంత్రుల‌కు బూతు పాఠాలు రాసిచ్చి, ప‌చ్చి అబ‌ద్ధాలు చెప్పించి వైయ‌స్ జ‌గ‌న్ పై వ్య‌క్తిత్వ హ‌న‌నం చేశారన్నారు. మావిగ‌న్ అంశాన్ని డైవ‌ర్టు చేస్తున్నామ‌నే భ్ర‌మ‌ల్లో బూతులు, అబ‌ద్ధాల‌తోనే కూట‌మి నాయ‌కులంతా మావిగ‌న్ కాన్సెప్టును ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారన్నారు. ఆ విధంగానే ఇన్నాళ్లూ వాళ్లు చేసిన పాపాల‌ను క‌డుక్కునే ప్ర‌య‌త్నం చేశారన్నారు.

Perni Nani TDP Attacking Jagan Personally to Cover Up Lack of Answer on Mavigun Proposal

మంత్రి అచ్చెన్నాయుడు చంద్ర‌బాబుకి బూతు బంట్రోతుగా మారిపోయాడని, 73 ఏళ్ల వ‌య‌సులో చంద్ర‌బాబుని ఎన్టీఆర్ తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టాడని, ఆయ‌న్ను ఔరంజేబుతో పోల్చాడన్నారు. ఆయ‌న‌తో పార్ట‌న‌ర్‌గా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం చంద్ర‌బాబుని అవినీతిప‌రుడిగా పేర్కొన్నాడని, ఆయన్ను గెలిపిస్తే అవినీతిని ప్రోత్స‌హించేన‌ట్టేన‌ని ప్ర‌క‌ట‌న చేశాడని తెలిపారు. చంద్ర‌బాబు కేబినెట్‌లో ఉన్న స‌గం మంది మంత్రులు ఒక‌ప్పుడు ఆయ‌న్ను తిట్టిన వీడియోలు చాలా ఉన్నాయన్నారు. 164 మంది ఎమ్మెల్యేల్లో చంద్ర‌బాబుని తిట్టిన వారి లెక్క వంద‌కి పైనే అన్నారు. చంద్ర‌బాబుని మోడీ, మోడీని చంద్ర‌బాబు దూషించుకున్నారన్నారు.

చంద్ర‌బాబుని ద‌గ్గుబాటు పురందీశ్వ‌రి ఎన్నిసార్లు తిట్టారో లెక్కే లేదన్నారు. తోడ‌ల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు ఏకంగా చంద్ర‌బాబు గురించి పుస్త‌కాలే రాశారని, టార్చ్‌లైట్ మినిస్ట‌ర్ అని పేరు కూడా పెట్టాడన్నారు. ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు పుస్త‌కాల‌ను టీడీపీ శిక్ష‌ణ త‌ర‌గ‌తుల్లో పంచి పెట్ట‌గ‌ల‌రా అని ప్రశ్నించారు. చంద్ర‌బాబు రాజ‌కీయాల‌ను రాజ‌కీయాలుగానే చూడాలి, చేయాలని, అప్పుడే అంద‌రికీ మంచిదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+