YS Sharmila : "అవి గొడ్డలి"- జగన్ మావిగాన్ కు షర్మిల షాకింగ్ పంచ్..!
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనకు మిశ్రమ స్పందన వస్తోంది. వైసీపీ దీన్ని అద్భుతమైన ప్లాన్ అంటూ ప్రమోట్ చేసుకుంటుంటే, కూటమి పార్టీలతో పాటు వైఎస్ షర్మిల విమర్శలకు దిగుతున్నారు. ఇదే క్రమంలో ఇవాళ షర్మిల (YS Sharmila) మావిగన్ పై దాడిని మరింత తీవ్రతరం చేశారు. అమరావతికి జగన్ పేరుతో మావిగన్ సరే, పులివెందులకు అవినాష్ పేరుతో "అవి గొడ్డలి " అని పెట్టాల్సిందంటూ షర్మిల సెటైర్లు వేశారు.
జగన్ పేరులో గన్ ఉంది , అవినాష్ పేరులో వినాశనం ఉందంటూ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సిద్ధాంతం ఎంతసేపూ నరకాలి, చంపాలి , నాశనం చేయాలనేదే అన్నారు. నిండు సభలో విజయమ్మను అవమానించినందుకు బొత్స ఎంత ఏడ్చినా తక్కువే అన్నారు. మావిగన్ పై స్పందిస్తూ.. ఎంతసేపు గన్నులు, గొడ్డల్లేనా? ఎంతసేపు నరకాలి.. చంపాలి.. నాశనం చేయాలనే ఆలోచిస్తారా అని ప్రశ్నించారు. 5 ఏళ్లలో జగన్ రాజధాని కోసం ఒక్క ఇటుక కూడా పెట్టలేదన్నారు. అధికారంలో వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చారని, ఇప్పుడు అమరావతి వద్దట, మావిగన్ పెడతారట అన్నారు.

పులివెందుల పేరు బదులు " ఆవి గొడ్డలి " అని పెట్టాలన్నారు. మీకు గన్నులు, గొడ్డళ్లు అని మాట్లాడడమే తెలుసన్నారు. అమరావతికి మావి గన్ అని మీ పేరు, పులివెందులకు అవినాష్ రెడ్డి పేరు మీద "ఆవి గొడ్డలి అని పెట్టాలన్నారు. నాశనం మావిగన్ అద్భుత ఐడియా అయితే 5 ఏళ్ళు అధికారంలో ఉండి గాడిదలు కాశారా అని ప్రశ్నించారు. మావిగన్ అద్భుతం అయితే ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. మావిగన్ కి తక్కువ ఖర్చు అయితే మూడు రాజధానులు ఎందుకు అన్నారని ప్రశ్నించారు. మావిగన్ మీద తమ వైఖరి అడుగుతున్నారని, ఎవరైనా జోక్ వింటే బిగ్గరగా నవ్వుతారని షర్మిల వ్యాఖ్యానించారు. మా నవ్వే మావిగన్ మీదున్న అర్థం అన్నారు. మళ్లీ దీనిమీద కొత్తగా వైఖరి చెప్పడం అనవసరం అన్నారు. అమరావతి మీద కాంగ్రెస్ వైఖరి ఇప్పటికే స్పష్టం చేశామని, పార్లమెంట్ లో కూడా మద్దతు ఇచ్చామని తెలిపారు. మద్దతు ఇస్తూనే అప్పులు ఇవ్వకండి అని చెప్పామన్నారు.












Click it and Unblock the Notifications