కీలక నియోజకవర్గాల్లో టీడీపీకి కొత్త ఇంఛార్జ్ లు- అనూహ్య ఎంపిక..!!

టీడీపీ రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. స్థానిక ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ.. నియోజకవర్గాలకు ఇంఛార్జ్ ల నియామక ప్రక్రియ పూర్తి చేస్తోంది. అందులో భాగంగా మరో రెండు కీలక నియోజకవర్గాలకు ఇంఛార్జ్ లను ప్రకటించారు. కూటమిలో మిత్రపక్షాలకు చెందిన ఎమ్మెల్యే లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీ ఇంఛార్జ్ నియామకం పైన పార్టీ ఫోకస్ చేసింది. ఇందు కోసం పార్టీ కసరత్తు తరువాత ఇంఛార్జ్ లను ప్రకటించింది.

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ.. బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ ఇంఛార్జ్ ల నియామక ప్రక్రియను పార్టీ వేగవంతం చేసింది. ఇప్పటికే తిరుపతి, కాకినాడ రూరల్ నియోజక వర్గాలకు ఇంచార్జ్ లను ప్రకటించిన టీడీపీ ఇప్పుడు మరో రెండు కీలక నియోజకవర్గాలను ఖరారు చేసింది. విజయవాడ పశ్చిమం, అవనిగడ్డ నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్ లను ప్రకటించింది. 2024 ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించారు. దీంతో టీడీపీ తరఫున నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలను ఇప్పటివరకు విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ (చిన్ని) నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా బుద్ధా వెంకన్నకు ఆ బాధ్యతలను అప్పగించింది.

tdp-president-appoints-in-charges-for-two-key-assembly-constituencies-in-krishna-dist-here-the-list

బీజేపీ, జనసేన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొత్త ఇంఛార్జ్ లు

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందిన బుద్ధా వెంకన్న గతంలో ఎమ్మెల్సీగా సేవలందించారు. ఇప్పుడు తిరిగి తన సొంత నియోజకవర్గ బాధ్యతలు కేటాయించారు. అదే విధం గా ..అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు నియామకం జరిగింది. రెండు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ పదవిని శ్రీనివాసరావుకు కేటాయించారు. గత నాలుగు, ఐదు నెలల నుంచి నరాలు తెగే ఉత్కంఠకు తొలి ఏకాదశి రోజున తెరపడింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీ తరపున సీటు ఆశించగా, చివరి నిముషంలో మండలి బుద్ధ ప్రసాద్ కు సీటు ఖాయం అయింది. దీంతో.. రెండేళ్లుగా ఇక్కడ ఇంఛార్జ్ నియామకం పైన చర్చలు జరిగాయి. ఎట్టకేలకు అవనిగడ్డకు ఇంచార్జ్ ను నియమిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+