అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌ను వీడనున్న చంద్రబాబు: ఏపీలో బిజీ షెడ్యూల్..అమరావతికి: పర్మిషన్ కోసం డీజీపీకి

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి హైదరాబాద్‌ను వీడబోతున్నారు. సొంత రాష్ట్రానికి రాబోతున్నారు. దీనికి అవసరమైన అనుమతిని కోరుతూ త్వరలోనే ఆయన పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాయనున్నారు. ఈ నెల 14 లేదా 15 తేదీల్లో చంద్రబాబు అమరావతికి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సారి ఆయన జూన్ నెలాఖరు వరకూ గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఇంట్లో ఉండబోతున్నారు.

అభిమాని పిలిచినా: జగన్‌తో భేటీకి బాలయ్య డుమ్మా: పైకి చెబుతోందొకటి: విషయం వేరొకటి?అభిమాని పిలిచినా: జగన్‌తో భేటీకి బాలయ్య డుమ్మా: పైకి చెబుతోందొకటి: విషయం వేరొకటి?

 అసెంబ్లీ సమావేశాల కోసం

అసెంబ్లీ సమావేశాల కోసం

ఈ నెల 16వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభం కాబోతున్నాయ. ఈ ఏడాది మార్చి మూడోవారంలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రతిపాదించినప్పటికీ.. కరోనా వైరస్ అప్పుడప్పుడే విస్తరిస్తుండటాన్ని దృష్టిలో ఉంచుకుని మూడు నెలల పాటు వాయిదా వేశారు. ఈ మూడు నెలలకు అవసరమైన బడ్జెట్‌ను ఓటాన్ అకౌంట్ చేశారు. ఈ మూడు నెలల కాల పరిమితి ఈ నెలాఖరుతో ముగియబోతోంది. దీనితో- అసెంబ్లీని సమావేశం పరిచి, పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.

ప్రతిపక్ష నేత హోదాలో

ప్రతిపక్ష నేత హోదాలో

బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు హాజరు కావాల్సి ఉంది. బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ హరిచందన్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాధారణంగా గవర్నర్ ప్రసంగానికి సభలో పూర్తిస్థాయి కోరం ఉంటుంది. అత్యవసర సందర్భాల్లో తప్ప ఏ సభ్యుడు కూడా గవర్నర్ ప్రసంగం నాడు సభకు హాజరు కాకుండా ఉండలేరు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు అసెంబ్లీకి హాజరు కానున్నారు. దీనికోసం ఆయన 14వ తేదీ నాడే హైదరాబాద్ నుంచి అమరావతికి చేరుకుంటారని తెలుస్తోంది.

19న రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌లో

19న రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌లో

ఈ నెల 18వ తేదీన బడ్జెట్‌ను సభలో ప్రతిపాదించిన మరుసటి రోజే రాజ్యసభ అభ్యర్థుల ఎన్నికల పోలింగ్ ఉంటుంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున సీనియర్ నాయకుడు వర్ల రామయ్య పోటీ చేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి అవసరమైన ఎమ్మెల్యేల బలం టీడీపీకి లేదు. ఏపీలో మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా.. అయిదుమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి చూస్తే.. ఈ నాలుగు స్థానాలు కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకే వెళ్తాయి.

Recommended Video

TDP State President Post : Kinjarapu Rammohan Naidu Given Clarification
టీడీపీ తరఫున తొలి ఓటు చంద్రబాబుదే..

టీడీపీ తరఫున తొలి ఓటు చంద్రబాబుదే..

రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా చంద్రబాబు ఎమ్మెల్యేగా తన ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున తొలి ఓటు ఆయనే వేస్తారని అంటున్నారు. ప్రస్తుతం టీడీపీకి మొత్తం 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. వారిలో ఇద్దరు పార్టీకి దూరంగా ఉన్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేశారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు పార్టీకి దూరంగా ఉన్నారు. మిగిలిన 21 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఓటింగ్‌లో పాల్గొంటారనేది ఆసక్తికరంగా మారింది.

English summary
Telugu Desam Party President and Former Chief Minister of Andhra Pradesh Chandrababu is likely to arrive Andhra Pradesh on 14th of June from Hyderabad. He will attend the Andhra Pradesh Assembly budget sessions, which is schedule to start from 16th of June.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X