వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా తో టీడీపీ అలర్ట్....!!

ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీలో చేరిన రోజుల వ్యవధిలోనే మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేసారు. తాత్కాలికంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఆశించిన టికెట్ రావటం లేదని ఖరారు కావటంతో అంబటి రాయుడు రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. రాయుడు నిర్ణయం పైన టీడీపీ స్పందించింది. ఆల్ ది బెస్ట్ చెప్పింది. టీడీపీ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

రాయుడు రాజీనామా : కొంత కాలంగా జగన్ కు అనుకూలంగా మాట్లాడుతున్న అంబటి రాయుడు పది రోజుల క్రితమే వైసీపీలో చేరారు. అంబటికి గుంటూరు లేదా నర్సరావు పేట సీటు ఇస్తారని పెద్ద ఎత్తున పార్టీలో ప్రచారం జరిగింది. ప్రస్తుతం సీట్ల ఖరారులో జగన్ లెక్కలు మారాయి. నర్సరావు పేట ఎంపీగా ఉన్న క్రిష్ణదేవరాయులును గుంటూరు బరిలో దింపాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆయనకు నేరుగా ఈ ప్రతిపాదన చేసారు. అయితే, తాను గుంటూరు నుంచి పోటీ చేయలేనని..నర్సరావుపేటలోనే కొనసాగించాలని కోరారు. దీని పైన పార్టీ నిర్ణయం ఏంటో చూసి ఆ తరువాత తన నిర్ణయం చెబుతానని క్రిష్ణదేవరాయులు స్పష్టం చేసారు. ఈ సమయంలోనే సీటు అంబటి రాయుడు రాజీనామా చేసారు.

TDP Reacts on Ambati Rayudu Resignation for YSRCP, says All the best

స్పందించిన టీడీపీ : సీట్ల సర్దుబాటు పైన చర్చ సాగుతున్న సమయంలోనే అంబటి రాయుడు తన రాజీనామా నిర్ణయం ప్రకటించారు. రాజకీయాలకు కొంత కాలం దూరంగా ఉంటానని స్పష్టం చేసారు. సరైన సమయంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. క్రికెట్ కెరీర్ లోనూ అంబటి రాయుడు దూకుడుగానే నిర్ణయాలు తీసుకొనే వారు. ఇప్పుడు రాజకీయంగానూ అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇక, అంబటి రాయుడు రాజీనామా పైన టీడీపీ స్పందించింది. "జగన్ లాంటి విపరీత ధోరణి ఉన్న వ్యక్తితో కలిసి మీరు రాజకీయ ఇన్నింగ్స్‌లు ఆడనందుకు సంతోషంగా ఉంది. మీ భవిష్యత్ ప్రయాణాలు మంచిగా సాగాలని కోరుకుంటున్నాం" అని అంబటిని ట్యాగ్ చేస్తూ టీడీపీ ట్వీట్ చేసింది.

రాజీనామా వెనుక : అంబటి రాయుడు వైసీసీకి రాజీనామా చేసిన వ్యవహారం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. దీంతో టీడీపీ వెంటనే అలర్ట్ అయింది. జగన్ ను లక్ష్యంగా చేసుకొని అంబటి రాయుడు రాజీనామా పైన సోషల్ మీడియా వేదికగా స్పందించింది. అంబటి భవిష్యత్ ప్రయాణం బాగుండాలని ఆకాంక్షించింది. ఇప్పుడు టీడీపీ ట్వీట్ వైరల్ అవుతోంది. అయితే, అంబటి రాయుడు మాత్రం తన రాజీనామాకు గల కారణాల పైన ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. దీని పైన వైసీపీ నేతలు స్పందించటానికి నిరాకరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+