టిక్కెట్లు దక్కక రెబెల్స్ గా బరిలోకి, అసంతృప్తులకు మంత్రులు, టిడిపి నేతల బుజ్జగింపులు
ఎంఏల్సి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక వ్యవహరం టిడిపిలో అసంతృప్తిని రేపుతోంది. టిక్కెట్లు దక్కని వారు రెబెల్ అభ్యర్థులుగా రంగంలో బరిలో ఉంటామని హెచ్చరిస్తున్నారు.
అమరావతి:ఎంఏల్ సి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక అధికార టిడిపిలో చిచ్చు రాజేసింది. ఎంఏల్ సి టిక్కెట్టును ఆశించి భంగపడ్డ పార్టీ నాయకులు తిరుగుబాటుబావుటాను ఎగురవేశారు. రెబెల్ అభ్యర్థులుగా రంగంలోకి దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే అసంతృప్తులతో పార్టీ నాయకత్వం చర్చలు జరుపుతోంది.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఏల్ సి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది.దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు అధికారాన్ని కట్టబెడుతూ పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకొంది.
ఈ మేరకు అభ్యర్థుల ఎంపిక కసరత్తును బాబు చేశారు.అయితే ఆశావాహులు ఎక్కువ ఉండడం సీట్ల సంఖ్య తక్కువగా ఉండడంతో పార్టీ నాయకత్వానికి తలనొప్పులు తప్పలేదు.
మంగళవారం నాడు నామినేషన్ల దాఖలుకు చివరి తేది కావడంతో సోమవారం అర్థరాత్రి వరకు అభ్యర్థుల ఎంపిక కసరత్తును నిర్వహించింది టిడిపి నాయకత్వం, పార్టీ జిల్లాల సమన్వయ కమిటీల సమావేశాల్లోనే అభ్యర్థులను ప్రకటించారు.

టిక్కెట్లు దక్కనివారిని బుజ్జగిస్తున్న టిడిపి నాయకత్వం
ఎంఏల్ సి ఎన్నికల్లో టిక్కెట్లు ఆశించి భంగపడ్డ అసంతృప్తులను సంతృప్తి పర్చేందుకుగాను టిడిపి నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది.శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు టిక్కెట్టు ఇవ్వడంపై పార్టీ సీనియర్ నాయకుడు కోళ్ళ అప్పలనాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలనే యోచనలో ఉన్నారు.అయితే ఎంపి రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇంచార్జ్ మంత్రి పరిటాల సునీత ఆయన్ను బుజ్జగిస్తున్నారు. అన్ని జిల్లాల్లో కూడ ఇదే రకమైన తంతు సాగుతోంది.

చిక్కాలకు ఎంఏల్ సి ఇవ్వడంతో బొడ్డు భాస్కరరామారావు అసంతృప్తి
నిజాయితీ పరుడిగా పేరొందిన మాజీ మంత్రి చిక్కాల రామచంద్రారావుకు ఎంఏల్ సి టిక్కెట్టును కేటాయించింది.అయితే చిక్కాలకు ఎంఏల్ సి టిక్కెట్టుకు ఇవ్వడాన్ని మాజీ ఎంఏల్ సి బొడ్డు భాస్కర రామారావు వ్యతిరేకిస్తున్నాడు. బొడ్డు భాస్కర రామారావు టిడిపి నుండి వైసిపిలో చేరారు. వైసిపి నుండి ఇటీవలే ఆయన టిడిపి తీర్థం పుచ్చుకొన్నారు. అయితే రెబెల్ గా బొడ్డు భాస్కర రామారావు సిద్దం కాగా, డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి పుల్లారావులు ఆయనను బుజ్జగిస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో కూడ ఇదే తంతు
పశ్చిమగోదావరి , నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూల్ జిల్లాల్లోనూ ఎంఏల్ సి అభ్యర్థుల ఎంపిక టిడిపి నాయకత్వానికి తలనొప్పిగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పార్థసారథి, అంబికా కృష్ణలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో వాకాటి నారాయణరెడ్డికి టిక్కెట్టు ఇవ్వడాన్ని ఆనం సోదరులు, ఆదాల ప్రభాకర్ రెడ్డిలు తీవ్రంగానే వ్యతిరేకించారు.

కడపలో బిటెక్ రవి గెలుపు కోసం సిఎం రమేష్ వ్యూహం
కడప జిల్లాల్లో స్థానిక సంస్థల ఎంఏల్ సి అభ్యర్థి విజయం కోసం సిఎం రమేష్ చక్రం తిప్పుతున్నారు. ఈ జిల్లాలో టిడిపి కంటే వైసిపికి అధిక సీట్లున్నాయి.అయితే వైసిపిని దెబ్బతీసేందుకు గాను రాజకీయంగా అధికార పార్టీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు వలసలను ప్రోత్సహిస్తోంది. వైసిపికి వ్యతిరేక పార్టీ నాయకుల సహయాన్ని కోరుతోంది టిడిపి. ఈ మేరకు సిఎం రమేష్ అంతర్గతంగా వైసిపికి వ్యతిరేకంగా ఉన్న పార్టీల నాయకులను కలుస్తూ బిటెక్ రవి గెలుపు కోసం సహకరించాలని కోరుతున్నారు. ఇక కర్నూల్ జిల్లాలో శిల్ప అభ్యర్థిత్వాన్ని ఫరూక్ తో పాటు భూమా వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు.












Click it and Unblock the Notifications