ఫలించని ప్రయత్నాలు, బరిలో రెబల్స్ : కూటమిలో టెన్షన్ , ఎవరెక్కడ..!!
ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా మారుతోంది. ఎన్నికల ప్రక్రియలో మరో కీలక ఘట్టం మగిసింది. నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిసింది. ఏ నియోజకవర్గంలో ఎంత మంది పోటీలో ఉన్నారో స్పష్టత వచ్చింది. టీడీపీ కూటమి నుంచి కీలక నియోజకవర్గాల్లో రెబల్స్ బుజ్జగింపులు ఫలించలేదు. దీంతో,వారు బరిలో నిలిచారు. ఇదే అంశం ఇప్పుడు కూటమిలో టెన్షన్ మొదలైంది. కొందరు నేతలు మాత్రం చివరి నిమిషంలో తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
ముగిసిన ఉపసంహరణ గడువు
టీడీపీ కూటమిలో కొత్త ఆందోళన మొదలైంది. మొత్తం 25 ఎంపీ స్థానాల్లో 1103 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా, 291 నామినేషన్లు తిరస్కరించారు. ఫలితంగా చివరకు 771 మంది తుది పోరులో పోటీ పడుతున్నారు. అదే విధంగా 175 అసెంబ్లీ స్థానాలకు 4189 మంది నామినేషన్లు దాఖలు చేసారు. వారిలో 53 మంది తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారు. 1677 నామినేషన్లు తిరస్కరణ గురయ్యాయి. కాగా, టీడీపీ నుంచి ముఖ్య నేతల బుజ్జగింపు ఫలితంగా నూజివీడు నుంచి ముద్రబోయిన వెంకటేశ్వర రావు, మాడుగుల నుంచి పైలా ప్రసాద్, మడకశిర నుంచి సునీల్ కుమార్ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కానీ, మరి కొన్ని కీలక నియోజకవర్గాల్లో మాత్రం రెబల్స్ పోటీలో నిలిచారు.

బరిలో రెబల్స్
అందులో ప్రధానంగా విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి మీసాల గీత పోటీలో ఉన్నారు. అక్కడ మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు కుమార్తె పోటీ చేస్తున్నారు. విజయనగరం సీటు ఆశించిన గీతకు టికెట్ దక్కలేదు. పార్టీ బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలించ లేదు. దీంతో..గీత స్వతంతర అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసారు. తుది పోటీలో తల పడుతున్నారు. అదే విధంగా ఉండి నియోజకవర్గంలోనూ టీడీపీ రెబల్ పోటీలో ఉన్నారు. అక్కడ టీడీపీ నుంచి గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కలవపూడి శివరామ రాజు టీడీపీ నుంచి సీటు రాకపోవటంతో తొలుత స్వతంత్ర అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసారు. అక్కడ నుంచి రఘురామ రాజు టీడీపీ అభ్యర్దిగా పోటీలో ఉన్నారు.
కూటమి నేతల్లో టెన్షన్
ఉండి నుంచి ప్రస్తుతం ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్దిగా పోటీ చేస్తున్నారు. దీంతో..అక్కడ పోటీ ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. రాజాం నుంచి జనసేన కు చెందిన రెబల్ అభ్యర్ది రేసులో నిలిచారు. ఇక..ఉమ్మడి అనంతపురం జిల్లాలో కీలక నియోజకవర్గంగా ఉన్న రాప్తాడులోనూ టీడీపీ రెబల్ పోటీలో ఉన్నారు. అక్కడ టీడీపీ నుంచి పరటాల సునీత పోటీ చేస్తున్నారు. టీడీపీ రెబల్ గా ప్రొఫెసర్ రాజేష్ నామినేషన్ దాఖలు చేసారు. ఆయనతో మంత్రాంగం చేసినా ఫలించ లేదు. దీంతో..ఆయన తుది రేసులో నిలిచారు. ప్రతీ నియోజకవర్గంలో గెలుపు కీలకంగా మారుతున్న సమయంలో రెబల్స్ పోటీలో నిలవటం ఎన్నికల ఫలితాల పై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఉత్కంఠ మొదలైంది.












Click it and Unblock the Notifications