వివేకా హత్య పై టీడీపీ బుక్ రిలీజ్- "జగనాసుర రక్తచరిత్ర" పేరుతో-ఆ రోజు ఏం జరిగింది ?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై టీడీపీ ఇవాళ జగనాసుర రక్తచరిత్ర పేరుతో ఓ పుస్తకం విడుదల చేసింది. ఇందులో వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందనే దానిపై పూసగుచ్చినట్లు వివరించారు.

ఏపీలో నాలుగేళ్ల క్రితం జరిగిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు ప్రస్తుతం సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో వైసీపీకి చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు పలువురు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇవాళ హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఈ కేసు విచారణ కూడా ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఈ హత్య ఎలా జరిగింది, దాన్ని కప్పిపుచ్చేందుకు జరిగిన ప్రయత్నాలపై "జగనాసుర రక్తచరిత్ర" పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేసింది.

వైఎస్ వివేకా హత్యపై టీడీపీ పుస్తకం

వైఎస్ వివేకా హత్యపై టీడీపీ పుస్తకం

ఏపీలో సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య పై సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలోనే ఇందులో వెలుగుచూసిన అంశాల ఆధారంగా టీడీపీ ఇవాళ ఓ పుస్తకం విడుదల చేసింది. వైసీపీ అధినేత, సీఎం జగన్ ను టార్గెట్ చేసే విధంగా రూపొందించిన ఈ పుస్తకంలో వివేకా హత్య ఎలా జరిగింది, కారకులెవరు, ఆ రోజు ఏం జరిగింది వంటి అంశాలను పొందుపరిచారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న వేళ జనంలోకి వివేకా హత్యను విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో టీడీపీ ఈ పుస్తకాన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది.

"జగనాసుర రక్తచరిత్ర" పేరుతో పుస్తకం

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు దారి తీసిన కారణాలు, హత్య జరిగిన తీరు, దాన్ని కప్పిపుచ్చేందుకు జరిగిన ప్రయత్నాలతో "జగనాసుర రక్తచరిత్ర" బుక్ ను టీడీపీ రూపొందించింది. ఇందులో వివేకా హత్యకు సంబంధించి పలు అంశాలున్నాయి. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి గురించి కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. "జగనాసుర రక్తచరిత్ర" పుస్తకాన్ని విడుదల చేయడం ద్వారా వివేకా కేసులో ఏం జరిగిందో జనాలకు తెలుస్తుందని టీడీపీ చెబుతోంది. దీంతో ఈ పుస్తకంలో రాసిన అంశాలు సంచలనం రేపేలా ఉన్నాయి.

కవర్ పేజ్ పై జగన్, అవినాష్

కవర్ పేజ్ పై జగన్, అవినాష్

24 పేజీలతో రూపొందించిన "జగనాసుర రక్తచరిత్ర" పుస్తకం కవర్ ఫోటోలోనే సీఎం జగన్, అవినాష్ రెడ్డి ఫోటోల్ని ముద్రించారు. అలాగే వివేకా హత్యలో సూత్రధారులు ఎంత పెద్ద స్ధాయిలో ఉన్నా శిక్ష పడకపోతే నరహంతకులు విచ్చలవిడిగా రెచ్చిపోతారు. రాష్ట్రంలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఉండదు. అందుకే హత్య కేసులో సూత్రధారుల్ని జాప్యం లేకుండా సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టాలి అనే వ్యాఖ్యలున్నాయి. ఆ కింద "జగనాసుర రక్తచరిత్ర" టైటిల్ తో పాటు దాని కింద బహిరంగం అంటూ ఓ బాటమ్ లైన్ కూడా పెట్టారు.

ఇంతకీ పుస్తకంలో ఏముంది ?

ఇంతకీ పుస్తకంలో ఏముంది ?

వివేకా హత్య కేసులో సీబీఐ తాజాగా విచారించిన సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్ భారతి సహాయకుడు నవీన్ తో వారు దిగిన ఫొటోల్ని ముద్రించిన టీడీపీ.. హత్య రోజు వీరు ఏం మాట్లాడుకున్నారనే కాల్ డేటా బయటపెట్టాలని కోరారు. అలాగే గుండెకు సంట్స్ వేయించుకుని చికిత్స పొందుతున్న 70 ఏళ్ల వివేకాను గంటపాటు ఎలా నరకయాతన పెట్టి చంపారనే అంశాల్ని ఆ తర్వాత వివరించారు. అలాగే వివేకా కుమార్తె జగన్ గురించి ఇచ్చిన వాంగ్మూలాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత అవినాష్, భాస్కర్ రెడ్డి హత్య ఆనవాళ్లు ఎలా చెరిపేశారు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్లో గుండెపోటని చెప్పడం, హత్య తర్వాత చోటు చేసుకున్న పలు పరిణామాల్ని పాయింట్ల రూపంలో ఈ బుక్ లో ప్రస్తావించారు.

సీబీఐ ఛార్జిషీట్లలో వివరాలే ఆధారంగా..

సీబీఐ ఛార్జిషీట్లలో వివరాలే ఆధారంగా..

సీబీఐ వైఎస్ వివేకా హత్య కేసులో దాఖలు చేసిన ఛార్జిషీట్లలో ఇప్పటికే పలు విషయాలు వెల్లడించింది. ఇవన్నీ గతంలో పత్రికల్లో, టీవీల్లో వెలుగుచూశాయి. వాటినే తిరిగి టీడీపీ ఈ "జగనాసుర రక్తచరిత్ర" పుస్తకంలో మరోసారి ప్రస్తావించింది. కడప టికెట్ కోసం జరిగిన ఈ హత్యలో పాలుపంచుకున్న వారిపై సీబీఐ వ్యక్తంచేసిన అనుమానాలు, దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారిపై పెట్టిన కేసులు, హైకోర్టు సీబీఐకి ఈ కేసును అప్పగించిన తీరు, సీబీఐ నమోదు చేసిన వాంగ్మూలాలు, అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి చెప్పిన విషయాలు, వివేకా హత్యను సాక్షి పత్రికలో నారాసుర రక్తచరిత్ర అంటూ ప్రచురించిన వైనం, వివేకా కుమార్తె హైకోర్టు, సీబీఐకి చెప్పిన విషయాలు, సాక్ష్యుల బెదిరింపులు, సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణకు ఈ కేసు దర్యాప్తు మారిన తీరు.. ఇలా పలు అంశాల్ని ఇందులో పొందుపరిచారు. చివర్లో సాక్షి పేపర్, టీవీల్లో వివేకా హత్యపై వచ్చిన వార్తలు, బ్రేకింగ్ న్యూస్ లు, ప్రెస్ మీట్ల ఫొటోలు,జగన్ వ్యాఖ్యలు, పులివెందుల పోలీసుల ప్రెస్ నోట్, సీబీఐ కౌంటర్లు, ఛార్జిషీట్ల ఫొటోలు కూడా ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+