చంద్రబాబుకు సీనియర్ నేత షాక్ - మీకో నమస్కారం...!!
ఏపీలో ఎన్నికల పోరు ఉత్కంఠ పెంచుతోంది. ప్రధాన పార్టీల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిలో భాగంగా మూడు పార్టీల్లోని కొందరు ముఖ్య నేతలకు సీట్లు దక్కలేదు. వారంతా ఆగ్రహం తో ఉన్నారు. కొందరు పార్టీలు వీడారు. టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ పెందుర్తి సీటు ఆశించారు. ఆ సీటు జనసేనకు కేటాయించారు. తాజాగా విశాఖ వచ్చిన చంద్రబాబును బండారు కలిసారు. ఆ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు వైరల్ అవుతున్నాయి.
టీడీపీ సీనియర్ నేత బండారు సత్యానారాయణ కు సీటు దక్కలేదు. పార్టీలో విశాఖ జిల్లాలో సీనియర్ గా ఉన్న బండారు పెందుర్తి సీటు పైన ఆశలు పెట్టుకున్నారు. ఆ సీటు పొత్తులో భాగంగా జనసేన అభ్యర్ది పంచకర్ల రమేష్ బాబుకు కేటాయించారు. బండారు తనకు సీట రాకపోవటం పైన మనస్థాపానికి గురయ్యారు. కొద్ది రోజుల క్రితం పార్టీ వీడుతున్నారనే ప్రచారం సాగింది. కానీ, తాను పార్టీ వీడటం లేదని బండారు స్పష్టత ఇచ్చారు. అదే సమయంలో జనసేన అభ్యర్దికి మద్దతుగా ప్రచారం చేయటం లేదు. దీంతో, తాజాగా విశాఖ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుతో బండారు సమావేశమయ్యారు. విశాఖ పార్టీ నేతల సమక్షంలోనే బండారు తనకు సీటు ఇవ్వకపోవటం పైన బండారు ఆవేదన వ్యక్తం చేసారు.

ఆ సమయంలో బండారుకు వీలైతే మాడుగుల ఇచ్చే అంశం పైనా చర్చ జరిగింది. అయితే, తాను మాడుగుల నుంచి పోటీకి సిద్దంగా లేనని బండారు తేల్చి చెప్పారు. పెందుర్తి సీటు తొలి నుంచి టీడీపీకి కంచుకోట గా ఉందని..ఆ సీటు ఏకపక్షంగా జనసేనకు ఎలా కేటాయించటంతో కేడర్ ఆవేదన చెందుతోందని బండారు చెప్పినట్లు సమాచారం. తాము తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించటం.. ప్రచారంలో పాల్గొనకపోవటం పైన బండారు పైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో..బండారు సత్యనారాయణ ఆవేదన చెందారు. చంద్రబాబుకు నమస్కారం పెట్టి బస్సు దిగి వెళ్లిపోయారు. అయితే, ఇప్పుడు బండారు సత్యనారాయణ తన మద్దతు దారులతో సమావేశం కానున్నారని సమాచారం. దీంతో..బండారు తదుపరి నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications