టీడీపీ నేత నిర్వాకం!: పార్టీ వాట్సాప్ గ్రూపులో 'బ్లూఫిల్మ్'
పార్టీకి చెందిన ఓ సీనియర్ లీడర్ నంద్యాల టీడీపీ వాట్సాప్ గ్రూపులో ఏకంగా ఓ బ్లూ ఫిల్మ్ వీడియోను పోస్టు చేశాడు.
నంద్యాల: జనాల్లో సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత రాజకీయ నాయకులు సైతం వాల్ పోస్టర్ పబ్లిసిటీ నుంచి సోషల్ మీడియా వాల్‌కు షిఫ్ట్ అయిపోయారు. అభిప్రాయాలను పంచుకోవడం, అభిమానులు, అనుచరులతో టచ్ లో ఉండటం.. పార్టీ కార్యక్రమాలకు జనాలను కూడగట్టడం.. ఇలా ప్రతీ పనికి ఈరోజు సోషల్ మీడియా తప్పనిసరి అయిపోయింది.
అందుకే పార్టీల బలోపేతం ఇప్పుడు సోషల్ మీడియాలోను జరుగుతోంది. ఆయా పార్టీలకు పీఆర్వోలు ఉన్నట్లే సోషల్ మీడియాలోను ఆయా పార్టీలకు, నాయకులకు అనుకూలంగా పనిచేసే వ్యక్తులు చాలామందే ఉన్నారు.
సరే ఇదంతా పక్కనబెడితే.. సోషల్ మీడియాలోకి పొలిటీషియన్స్ ఎంట్రీ ఇవ్వడం దాకా బాగానే ఉంది గానీ ఏమాత్రం దాన్ని దుర్వినియోగం చేసినా సీన్ రివర్స్ అయిపోవడం ఖాయం. ఇప్పుడు నంద్యాల టీడీపీలోను ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.

కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ నేతలు పార్టీతో టచ్ లో ఉండటం కోసం ఓ వాట్సాప్ గ్రూపును నిర్వహిస్తున్నారు. పార్టీకి చెందిన ఓ సీనియర్ లీడర్ నంద్యాల టీడీపీ వాట్సాప్ గ్రూపులో ఏకంగా ఓ బ్లూ ఫిల్మ్ వీడియోను పోస్టు చేశాడు. ఇదే గ్రూపులో మహిళా కౌన్సిలర్లు సైతం ఉండటంతో విషయం సీరియస్ అయింది. దీంతో సదరు సీనియర్ నేత నిర్వాకం అధినేత చంద్రబాబు దాకా వెళ్లినట్లు తెలుస్తోంది.
అయితే వాట్సాప్ వినియోగం తెలియనందువల్లే ఈ పొరపాటు జరిగి ఉంటుందని సదరు నేత తన తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఏదేమైనా ఓవైపు టీడీపీ ప్రభుత్వం మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులు నిర్వహిస్తుంటే.. మరోవైపు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications