టీడీపీ రెండో జాబితా సిద్దం - సీనియర్లకు బుజ్జగింపులు..!!
ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా మారింది. ప్రధాన పార్టీలు కొత్త వ్యూహాలతో తల పడుతున్నాయి. సీఎం జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. బీజేపీ ఈ కూటమితో కలుస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత రావటం లేదు. టీడీపీ, జనసేన తొలి జాబితాలో 99 మందిని ప్రకటించారు. రెండో జాబితాపై కసరత్తు జరుగుతోంది. కొందరు సీనియర్లకు సీట్లు దక్కటం అనుమానంగా కనిపిస్తోంది. దీంతో, వారితో చంద్రబాబు మంతనాలు మొదలు పెట్టారు.
రెండో జాబితాపై కసరత్తు: పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటాయించారు.అందులో 5 స్థానాలను పవన్ అభ్యర్దులను పవన్ ప్రకటించారు. టీడీపీ 94 స్థానాల్లో అభ్యర్దులను ఖరారు చేయగా.. సీనియర్లు పలువురికి సీట్లు దక్కలేదు. కీలక స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇదే సమయంలో సీనియర్ల సీట్ల పైన క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.

ఈ సమయంలోనే చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. ఢిల్లీలో బీజేపీ కదలికల పైన చర్చించారు. బీజేపీ కలిసి వస్తే..కేటాయించాల్సి సీట్లు..కలిసిరాకపోతే...ఎవరు ఏ సీట్లలో పోటీ చేయాలనే అంశం పైన ఒక నిర్ణయానికి వచ్చారు. తొలి జాబితా ప్రకటన తరువాత రెండు పార్టీల్లో వచ్చిన స్పందనతో రెండో జాబితా కు ముందే ఇరు పార్టీల అధినేతలు ఆశావాహులతో చర్చించాలని నిర్ణయించారు.
చంద్రబాబుతో భేటీ: సీట్లు ఆశిస్తున్న ఆశావాహులు చంద్రబాబుతో సమావేశమయ్యారు. రెండో జాబితాలో తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కళా వెంకట్రావు, సోమిరెడ్డి, గుమ్మనూరు జయరాం, గౌతు శివాజీ, బండారు అప్పలనాయుడు తమ సీట్ల గురించి చర్చించారు. కళా వెంకట్రావు ఎచ్చెర్ల స్థానాన్ని ఆశిస్తున్నారు. సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు.
కళా వెంకట్రావు, సోమిరెడ్డికి ఇప్పటి వరకూ క్లారిటీ అయితే రాలేదు. ఇక గౌతు శివాజీ కుమార్తె గౌతు శీరిష వచ్చేసి పలాస టికెట్ ఆశిస్తున్నారు. బండారు సత్యనారాయణ మూర్తి పెందుర్తి టికెట్ ఆశిస్తున్నారు. రామ్మోహనాయుడు వెంట చంద్రబాబు నివాసానికి బండారు అప్పలనాయుడు వచ్చారు.
గుంతకల్లో గుమ్మనూరుకు షాక్.. సపోర్ట్ చేయమన్న జితేందర్ గౌడ్ వర్గం..!!#GummanuruJayaram #JithenderGoud #YSRCP #TDP #Guntakal #Oneindiatelugu pic.twitter.com/7erSz13WzU
— oneindiatelugu (@oneindiatelugu) March 6, 2024
సీట్లు దక్కేదెవరికి: గుమ్మనూరు జయరాం.. గుంతకల్లు స్థానం ఆశిస్తున్నారు. గుమ్మనూరుకు వ్యతిరేకంగా గుంతకల్లులో టీడీపీ కేడర్ ఆందోళన నిర్వహిస్తోంది. రెండో విడత అభ్యర్థుల జాబితాలో తమ పేర్లు ఉంటాయని సీనియర్ నేతలు ఆశిస్తున్నారు. దీంతో..ఇప్పుడు చంద్రబాబు సీటు విషయంలో తనకు నిర్ణయం వదిలేయాలని..గెలుపు ముఖ్యమని గుర్తించాలని కోరుతున్నారు.
పార్టీ అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తున్నారు. పొత్తుల్లో భాగంగా కొందరికి సీట్లు సాధ్యపడటం లేదని చెప్పినట్లు సమాచారం. దీంతో, రెండో జాబితాలో సీట్లు ఎవరికి దక్కుతాయి..ఎవరికి నిరాశ మిగులుతుందనే చర్చ ఇప్పుడు పార్టీలో మొదలైంది. టీడీపీ, జనసేన రెండో జాబితా రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications