• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆట మొదలుపెట్టిన వారికే మైలేజ్-ఏపీలో 2019 సీన్ రిపీట్- పట్టాభి మైండ్ గేమ్ లో ఎవరెక్కడ ?

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఓ నానుడి ఉంది. ఆట ఎవరు మొదలుపెడతారో వారే అందులో విజేతలుగా నిలుస్తారనేది ఆ నానుడి. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. గతంలో చంద్రబాబు హయాంలో వైఎస్ జగన్ ప్రారంభించిన ఆట చివరికి ఆయన్ను అధికార పీఠంపై భారీ మెజారిటీతో కూర్చోబెట్టింది. ఇప్పుడు వైసీపీ హయాంలో చంద్రబాబు ఆడుతున్న ఆట ఆయన్ను చివరికి అధికార పీఠానికి చేరువ చేస్తుందో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికైతే పైచేయి లభించేలా చేసింది. పట్టాభి ఎపిసోడ్ ముందూ, వెనుకా ఏం జరిగిందో చూస్తే ఆ విషయం ఇట్టే అర్ధమవుతుంది.

 పట్టాభి వ్యాఖ్యల బ్యాక్ గ్రౌండ్

పట్టాభి వ్యాఖ్యల బ్యాక్ గ్రౌండ్

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికే ఘోర పరాజయంతో కుదేలైన టీడీపీని పూర్తిగా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. దీంతో టీడీపీ కూడా వైసీపీపై మాటల దాడిని ముమ్మరం చేసింది. రెండేళ్లుగా పలు అంశాలపై వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కోటలు దాటిపోతోంది. అయినా ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఇదే క్రమంలో టీడీపీ చేసే విమర్శల్ని వైసీపీ లైట్ తీసుకోవడం మొదలుపెట్టింది. విపక్షం నుంచి ఎన్ని విమర్శలు ఎదురైనా సీఎం జగన్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు. విపక్షం కంటే మీడియాలో వచ్చే వార్తలకే ఆయన ఎక్కువగా రియాక్టవుతున్నారు. దీంతో వైసీపీని టార్గెట్ చేసేందుకు, జగన్ ను ఇందులోకి లాగేందుకు టీడీపీ రచించిన వ్యూహమే పట్టాభి. విజయవాడకు చెందిన ఓ లో ప్రొఫైల్ రాజకీయ నాయకుడైన పట్టాభి దూకుడు మనస్తత్వాన్ని క్యాష్ చేసుకుంటూ ఆయన్ను టీడీపీ ప్రోత్సహించింది. దీంతో ఆయన వైసీపీపై వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. చివరికి జగన్, డీజీపీ సవాంగ్ పై బోసడికే వ్యాఖ్యల వరకూ వెళ్లారు.

 పట్టాభి వ్యాఖ్యలకు వైసీపీ రియాక్షన్

పట్టాభి వ్యాఖ్యలకు వైసీపీ రియాక్షన్

పట్టాభి సీఎం జగన్, డీజీపీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని వైసీపీ ఎప్పటిలాగే లైట్ తీసుకుంటుందని అంతా భావించారు. కానీ దీనిపై పక్కా లెక్కలతో ఉన్న టీడీపీ మాత్రం పట్టాభి వ్యాఖ్యలకు తగిన రియాక్షన్ కోసం ఎదురుచూసింది. అప్పటికే అయ్యన్నపాత్రుడు గతంలో సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలతో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ రెచ్చిపోవడం, తాము అనుకున్న మైలేజ్ రావడంతో ఈసారి కూడా వైసీపీ స్పందిస్తుందని టీడీపీ ఎదురుచూసింది. అనుకున్నట్లుగానే వైసీపీ పట్టాభి వ్యాఖ్యలపై దీటుగా స్పందించింది. ఏకంగా టీడీపీ కార్యాలయాలపై దాడులకు దిగింది. అంతే టీడీపీ కోరుకున్న దాని కంటే ఎక్కువ ప్రతిఘటనే వారికి లభించింది. అలా వైసీపీ ఎప్పుడైతే స్పందించిందో అప్పుడే టీడీపీ సగం సక్సెస్ అయింది.

 టీడీపీ ట్రాప్ లో వైసీపీ పడిందిలా..

టీడీపీ ట్రాప్ లో వైసీపీ పడిందిలా..

అప్పటికే అయన్నపాత్రుడు వ్యాఖ్యలకు వైసీపీ నుంచి వచ్చిన రియాక్షన్ ను దృష్టిలో ఉంచుకుని టీడీపీ వివాదాస్పద వ్యాఖ్యల్ని నమ్ముకుంది. పట్టాభితో అవే వ్యాఖ్యలు చేయించింది. ఇంతవరకూ ఏపీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పట్టాభి చేసిన వ్యాఖ్యలతో వైసీపీకి ఎక్కడో కాలింది. చివరకు టీడీపీ అనుకున్నట్లుగానే వైసీపీ దాడులతో సమాధానం చెప్పింది. దీంతో టీడీపీ కోరుకున్న దాని కంటే ఎక్కువగానే వైసీపీ రియాక్ట్ అయినట్లయింది. దీన్ని వాడుకుంటూ టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షకు దిగారు. దీంతో వైసీపీ కూడా పోటీ దీక్షలకు పిలుపు ఇవ్వాల్సి వచ్చింది. అదే సమయంలో టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు దీక్షలో టీడీపీ నేతలు రెచ్చిపోతుంటే దీనికి కౌంటర్ గా వైసీపీ నేతలు కూడా జనాగ్రహ దీక్షల్లో అంతకు మించి రెచ్చిపోయారు.

 దూషణల్లో పట్టాభిని మించిపోయిన వైసీపీ

దూషణల్లో పట్టాభిని మించిపోయిన వైసీపీ

పట్టాభి వ్యాఖ్యలపై స్పందించే క్రమంలో వైసీపీ నేతలు జనాగ్రహ దీక్షల్లో రెచ్చిపోయారు. చంద్రబాబు, లోకేష్, పట్టాభిపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీని టార్గెట్ చేస్తూ బూతులతో రెచ్చిపోయారు. అధినేత నుంచి వచ్చిన సంకేతం కావడంతో టీడీపీని ఈసారి వారి కంటే మించిన బూతులతో టార్గెట్ చేశారు. దీంతో పట్టాభి వ్యాఖ్యలు ఎక్కడికో పోయాయి. వైసీపీ నేతలు వాడిన బూతులు జనంలోకి బాగా వెళ్లాయి. పట్టాభి బోసడికే, దద్దమ్మ పదాలను మాత్రమే వాడితే .. ఇప్పుడు వైసీపీ అగ్రనేతలు సైతం దారుణమైన పదాలతో విరుచుకుపడ్డారు. దీంతో పట్టాభి వ్యాఖ్యలతో ఆగ్రహంగా ఉన్న ప్రజలు.. ఇప్పుడు వైసీపీ నేతల వ్యాఖ్యలు చూసి అవాక్కయ్యారు.

 జాతీయ స్ధాయికి చంద్రబాబు మైండ్ గేమ్

జాతీయ స్ధాయికి చంద్రబాబు మైండ్ గేమ్

ఎప్పుడైతే పట్టాభి వ్యాఖ్యలకు స్పందించి వైసీపీ తమ కార్యాలయాలపై దాడులు మొదలుపెట్టిందో అప్పుడే అమిత్ షా కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు చంద్రబాబు. అంతటితో ఆగకుండా రాష్టపతి పాలనకు సైతం డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా జాతీయ స్ధాయి రాజకీయాల దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా మోడీ, అమిత్ షా, రాష్ట్రపతికి దీనిపై లేఖలు రాయడం ద్వారా పట్టాభి వ్యాఖ్యలు తప్పుకాదు కానీ తమ కార్యాలయాలపై వైసీపీ దాడులే తప్పు అన్నట్లుగా బిల్డప్ ఇవ్వడం మొదలుపెట్టారు. అదే సమయంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో దీక్షకు దిగారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ ఈ మైండ్ గేమ్ లో పూర్తిగా వెనుకబడిపోయింది. చివరికి కోలుకుని కౌంటర్లు ఇవ్వడం ప్రారంభించింది.

 తడబడి తేరుకున్న వైసీపీ

తడబడి తేరుకున్న వైసీపీ

టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలకు స్పందించి టీడీపీ కార్యాలయాలపై దాడులకు పార్టీ శ్రేణుల్ని పంపిన వైసీపీ.. ఆ తర్వాత చంద్రబాబు రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయడం, ప్రధాని, హోంమంత్రి, రాష్ట్రపతికి లేఖలు రాయడంతో డిఫెన్స్ లో పడింది. అయినా తేరుకుని వెంటనే టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. అంతే కాదు చంద్రబాబు దీక్ష ప్రకటించిన తర్వాత తాము కూడా దానికి కౌంటర్ గా జనాగ్రహ దీక్షలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులోనూ చంద్రబాబు దీక్షాస్ధలి దగ్గర టీడీపీ నేతల వ్యాఖ్యలు గమనిస్తూ జనాగ్రహ దీక్షల్లో వాటికి కౌంటర్లు ఇప్పించే కార్యక్రమం మొదలుపెట్టింది. మొత్తం మీద చంద్రబాబు దీక్ష సాగుతున్నంత సేపూ జనాగ్రహ దీక్షల రూపంలో కౌంటర్లు పడుతూనే ఉండాలని కోరుకుంది. చివరికి చంద్రబాబు దీక్ష ముగియగానే అదంతా ఫార్స్ అంటూ సజ్జల మీడియా ముందుకు వచ్చారు. దీంతో టీడీపీ అడుగుల్ని బట్టే వైసీపీ వ్యవహరించిందనే విషయం అందరికీ అర్ధమైంది.

  YSRCP, TDP పై RGV సెటైర్..మధ్యలో ఆయన పై కూడా | Ap Politics || Oneindia Telugu
   మైండ్ గేమ్, మైలేజ్ గేమ్ లో టీడీపీ సక్సెస్

  మైండ్ గేమ్, మైలేజ్ గేమ్ లో టీడీపీ సక్సెస్

  పట్టాభి వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ రియాక్ట్ కావడం దగ్గరి నుంచి టీడీపీ సక్సెస్ మొదలైంది. పట్టాభి వ్యాఖ్యలకు వైసీపీ రియాక్ట్ కాకపోతే ఇంత హంగామా, బూతు పంచాగ శ్రవణాలు, వార్నింగ్ లు, కేంద్రానికి ఫిర్యాదులు, రాష్ట్రపతి పాలన డిమాండ్లు, టీడీపీ గుర్తింపు రద్దు డిమాండ్లు తెరపైకి వచ్చేవి కావు. కానీ అలా ఊరుకుంటే వైసీపీ ఎందుకవుతుంది. చంద్రబాబు నలభయ్యేళ్ల అనుభవాన్ని ఎప్పుడూ టార్గెట్ చేసే వైసీపీ ఆ అనుభవంతో విసిరిన ట్రాప్ లో అలవోకగా చిక్కుకుంది. చివరికి చంద్రబాబు అడుగుల్ని బట్టే తన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు కేంద్రం వద్దకు చంద్రబాబు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నారు. దీంతో తర్వాత జగన్ కూడా ఢిల్లీ వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా టీడీపీ వైసీపీపై మైండ్ గేమ్ లోనూ, మైలేజ్ గేమ్ లోనూ సక్సెస్ అయ్యిందనే వాదన వినిపిస్తోంది.

  English summary
  after tdp leader pattabhi comments against ys jagan, chandrababu successfully continue his mind game over ysrcp.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X