పోలవరం ప్రాజెక్ట్ పై మంత్రి అనిల్ వీడియోలు పోస్ట్; టీడీపీ రచ్చ ... ఘాటుగా మంత్రి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ ఏదో ఒక అంశంపై అధికార వైసీపీ ని టార్గెట్ చేసిన టీడీపీ తాజాగా సోషల్ మీడియా వేదికగా పోలవరం వ్యవహారంపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను టార్గెట్ చేస్తూ రచ్చ మొదలుపెట్టింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరంపై ప్రగల్భాలు పలికారని, కానీ ఇప్పటి వరకు పోలవరం ఎందుకు పూర్తి కాలేదని జగన్ సర్కార్ ను, ముఖ్యంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను టార్గెట్ చేశారు.

పోలవరం పూర్తి కాకపోవటంపై జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్న టీడీపీ


అధికారం చేపట్టిన తరువాత రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఛాలెంజ్ చేసిన అనిల్ కుమార్ యాదవ్ పాత వీడియోలను పోస్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్ ను ఏ మేరకు పూర్తి చేశారో చెప్పాలని, ఇంతవరకు ఎందుకు పోలవరం పూర్తి కాలేదో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించాలని పేర్కొంది. దీంతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను పోలవరం విషయంలో సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు.

రెండేళ్ళల్లో పోలవరం పూర్తి చేస్తామని సవాల్ చేసిన మంత్రి అనిల్ పై ట్రోల్స్

రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తే టీడీపీని మూసేస్తారా అని నాడు మంత్రి అన్నారని గుర్తు చేసి ఇప్పుడు రెండేళ్లలో పోలవరం పూర్తి కాలేదు అంటూ ఇప్పుడు ఏది మూసేద్దామో చెప్పాలని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్ రెడ్డి జూన్ 20 21 అంటే, మిగతా బులుగు బ్యాచ్ డిసెంబర్ 2021 నాటికి పోలవరం పూర్తి అన్నారని పేర్కొన్న టిడిపి నేతలు, చివరకు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు శాతం పనులు మాత్రమే పూర్తి చేశారంటూ ఎద్దేవా చేశారు. గతంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మంత్రి అప్పలరాజు, ఎంపీ విజయసాయిరెడ్డి పోలవరం పూర్తి చేసే అంశంపై చేసిన వ్యాఖ్యల వీడియోలను పోస్ట్ చేసి మరీ ప్రశ్నిస్తున్నారు.

నోటిపారుదల మంత్రి అంటూ .. పాత వీడియోలు పోస్ట్ చేసి మరీ

ఎగసెక్కాలు, అరిచి చెప్పడాలు, బల్ల గుద్దుళ్ళు, బొబ్బలు పెట్టడాలు... ఇలాంటి నోటిపారుదల మాటలన్నీ అయిపోయాయి కదా! పోలవరం పూర్తయిపోయిందా నాయనలారా? ఆ రేంజ్ లో నోరు పారేసుకున్నప్పుడే మీకు చేతకాదని అర్థం అంటూ ఎద్దేవా చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు . ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పుకుంటారో చెప్పండి అంటూ గత వీడియోలను పోస్ట్ చేసి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను గట్టిగానే టార్గెట్ చేశారు. ఇక ఈ వ్యవహారం ఇప్పుడు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

తనపై వస్తున్న ట్రోల్స్ పై ఘాటుగా రియాక్ట్ అయిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్

తనపై వస్తున్న ట్రోల్స్ పై ఘాటుగా రియాక్ట్ అయిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్

ఇక పోలవరం ప్రాజెక్టు విషయంలో తనను ట్రోలింగ్ చేయడంపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు. 2018లో పోలవరం నుంచి నీటిని విడుదల చేస్తామని చెప్పిన దేవినేని ఉమ చేతులు ఎత్తేశారని ఆయనపై ఎందుకు ట్రోల్ చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఎందుకు ఆలస్యం అయిందో తెలియదు అంటూ టిడిపి నేతలను ప్రశ్నించిన ఆయన, నెటిజన్లు ఎవరూ తనను ట్రోల్ చేయడం లేదని, కేవలం తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రమే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 దమ్మున్తే వాస్తవాలు ట్రోల్ చెయ్యాలని సవాల్

దమ్మున్తే వాస్తవాలు ట్రోల్ చెయ్యాలని సవాల్

తెలుగుదేశం పార్టీ నేతలకు నిజాలు చెప్పే ధైర్యం లేదని మండిపడ్డారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. డయాఫ్రమ్ వాల్, కాంక్రీట్ వాల్ నాణ్యతా లోపం వాస్తవం కాదా అంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. టీడీపీ చెంచా మీడియా అసత్య కథనాలను జనాలు నమ్మరని ఆయన స్పష్టం చేశారు. టిడిపి నేతలకు నిజాలు చెప్పే దమ్ముంటే వాస్తవాలను ట్రోల్ చేయాలని సవాల్ విసిరారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. మరి మంత్రి వ్యాఖ్యలకు టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో? ముఖ్యంగా దేవినేని ఉమా ఏమంటారో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+