బాబుపై వ్యాఖ్య: జగన్‌ను టార్గెట్ చేసిన పరిటాల సహా ఇతర మంత్రులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రాబు నాయుడిపై చేసిన వ్యాఖ్యలపై పరిటాల సునీత సహా మంత్రులు, తెలుగుదేశం నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ నాయకుడు వైయస్ జగన్‌ను టార్గెట్ చేశారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రాబు నాయుడిపై చేసిన వ్యాఖ్యలపై పరిటాల సునీత సహా మంత్రులు, తెలుగుదేశం నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ నాయకుడు వైయస్ జగన్‌ను టార్గెట్ చేశారు. ఆయనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం నుంచే ఆయనపై తీవ్రంగా మండిపడుతున్నారు.తన భర్త పరిటాల రవీంద్రను పొట్టన పెట్టుకుంది జగన్ అని పరిటాల సునీత ఆరోపించారు. ఈ రోజు తాము తలుచుకుంటే జగన్ ఒక్క రోజు కూడా నడిరోడ్డుపై తిరగలేరని ఆమె అన్నారు. పిచ్చిపట్టిన కుక్కలా జగన్ మాట్లాడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్ ప్రవర్తన ఉన్మాదిని తలపిస్తోందంటూ ధ్వజమెత్తారు.
శుక్రవారం గోరంట్లలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పరిటాల సునీత మాట్లాడారు. జగన్ ప్రవర్తన ఉన్మాదిలా ఉందని అన్నారు. కాల్చి చంపే అలవాటు మీ సంస్కృతే అని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. ఆ సంస్కృతే తన భర్త పరిటాల రవీంద్రను హత్య చేయించిందని ఆమె మరోసారి ఆరోపించారు. తన భర్త పరిటాల రవిని పట్టపగలు హత్య చేయించింది నువ్వు, నీ తండ్రి కాదా అంటూ జగన్‌పై మండిపడ్డారు.

నీది నీచ సంస్కృతి...
నీది నీచ సంస్కృతి.. నీవా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేదని జగన్‌ను ప్రశ్నించారు. తమ నాయకుడు చంద్రబాబు హత్యా రాజకీయాలకు వ్యతిరేకమన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని జగన్‌కు హితవు పలికారు. రాష్టం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి మీకు కనిపించడం లేదా అని జగన్‌ను అడిగారు. రైతు. డ్వాక్రా రుణమాఫీ, పింఛన్లు ఇలా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామంటే అది తమ నాయకుడు చంద్రబాబు వల్లే సాధ్యమైందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

ముఖ్యమంత్రిని ఎప్పుడు కాలుస్తావ్....
‘జగన్! ముఖ్యమంత్రిని ఎప్పుడు కాల్చేస్తావ్..? ఏ తుపాకీతోనా.. నాటు తుపాకీతోనా.. ఏకే-47తోనా..? డేట్ ఫిక్స్ చేస్తావా..? నంద్యాల ఎన్నికల లోగానా? ఆ తర్వాతనా?.. ముఖ్యమంత్రిని ఎక్కడికి రమ్మంటావ్? ఫ్యాక్షన్ కుటుంబ చరిత్ర ఉన్న నీవు ఇంకా దాన్నుంచి బయటకు రాలేకపోతున్నావ్..' అని వ్యవసా యశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.
ఉప ఎన్నికలో వైసీపీ ఓటమి ఖా యం కావడం జీర్ణించుకోలేక ఫ్యాక్ష న్ నేపథ్యమున్న జగన్ ఇలా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. జగన్‌పపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

జగన్ భాష మార్చుకోవాలి....
ప్రతిపక్ష నేత జగన్ ఫ్యాక్షన్ భాష మానుకోవాలని తిరుపతి ఎమ్మెల్యే సుగుణ సూచించారు. శుక్రవారం తుడా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం పాలన ప్రజారంజకంగా కొనసాగుతోందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, ఈ కారణంగానే నిస్సహాయ స్థితికి లోనై జగన్ తిడుతున్నారని అన్నారు. జగన్ లాంటి నేతలకు అధికారం దక్కితే రాష్ట్రం నాశనమైపోతుందన్నారు.
విజయం కోసం జగన్ ప్రచారం చేసుకుంటే అభ్యంతరం లేదని, సీఎంను నిందించడం దారుణమని అన్నారు. జగన్ ఎన్నిరకాలుగా ప్రయత్నించినా నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం, టీడీపీ గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి స్థాయి పదవుల్లో వున్న వారిపై అసభ్య పదజాలాన్ని ప్రయోగించకుండా చట్టాన్ని తేవాలని ఆమె సూచించారు.

జగన్‌పై కేసు పెట్టాలి...
చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ఓ వ్యక్తిని కాల్చి చంపాలనడం చట్టరీత్యా నేరమని అభిప్రాయపడ్డారు. జగన్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్ వన్నీ ఫ్యాక్షన్ ఆలోచనలేనని ఆయన అన్నారు. చంద్రబాబుకు తక్షణమే జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఉన్మాదిలా మాట్లాడారు...
జగన్ సమాజానికి పట్టిన చీడపురుగని మంత్రి కె.అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. నంద్యాల సభలో ఉన్నాదిలా మాట్లాడారని, ఆయనది నేరపూరిత మనస్తత్వమని అన్నారు. అధికారం లేకుండానే రోడ్డుమీద చంద్రబాబును కాల్చి చంపాలన్న జగన్.. అధికారంలోకి వస్తే ఏం చేస్తాడో ప్రజలు ఆలోచించాలని ఆయన సూచించారు. నంద్యాల ప్రశాంతతను చెడగొడుతూ పులివెందుల మార్కు ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని అన్నారు.

ఉగ్రవాదిలా...
చంపుతాం... నరుకుతామంటూ జగన్ ఓ ఉగ్రవాదిలా మాట్లాడుతున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరులో అన్నారు. జగన్ బరి తెగించి రౌడీలా వ్యవహరిస్తున్నారని మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు విమర్శించారు.. ఏనుగుకు సింహం కలలోకి వస్తే చస్తుందని, చంద్రబాబు చేపడుతున్న అభివృద్ధి ఏదో ఒకరోజు జగన్‌కు కలలోకి రావడం ఖాయం.. భయపడి చావడం ఖాయమని మంత్రి జవహర్ అన్నారు.












Click it and Unblock the Notifications