వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మీ ఇష్టమే నా ఇష్ట’మంటున్న చంద్రబాబు (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల ఎంపికలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. 'మీ ఊరు.. మీ అభ్యర్థి.. మీ ఇష్టమే నాకూ ఇష్టం' అనే నినాదంతో దేశంలోనే తొలిసారి వినూత్న విధానానికి తెరతీస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజల అభీష్టానికి అనుగుణంగా అభ్యర్థిని నిర్ణయించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్(ఐవీఆర్ఎస్)ను ఉపయోగించుకోనున్నారు. చివరకు పార్టీ అధినేత అభ్యర్థిత్వాన్ని కూడా ఈ విధానంలోనే నిర్ణయించనున్నారు. 'దేశ చరిత్రలో ఇలాంటి ప్రయోగం చేస్తున్న తొలి పార్టీ టిడిపి, రాబోయే రోజుల్లో అందరూ ఇదే మార్గాన్ని అనుసరించాల్సి ఉంటుంది' అని చంద్రబాబు ఆదివారం మీడియాకు తెలిపారు.

క్షేత్రస్థాయిలో కార్యకర్తల, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎక్కడో కూర్చుని అభ్యర్థులను ఖరారు చేస్తే సత్ఫలితాలు రావని, అభ్యర్థుల ఎంపికలో ప్రజా భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని భావించే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఐవిఆర్ఎస్ విధానం అమలుకు టాటా కంపెనీ నుంచి 13 వేల లైన్లు తీసుకున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఒక్కో కాల్‌కు 33 నుంచి 34 పైసలు ఖర్చు అవుతుందని తెలిపారు.

ఐవిఆర్ఎస్ విధానంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు ఆరేడు రోజుల సమయం పడుతుందని చంద్రబాబు చెబుతున్నారు. ఈ విధానంలో కార్యకర్తలు, ప్రజలకు ఫోన్ చేసినప్పుడు వారికి ముందుగా పార్టీ అభ్యర్థులపై మీ అభిప్రాయం చెప్పండి అంటూ పార్టీ అధినేత చంద్రబాబు స్వరం విన్పిస్తుంది. అనంతరం ఇద్దరు నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లను విన్పిస్తారు. ఒక్కో అభ్యర్థికి ఒక్కో నెంబరును సూచిస్తారు. తమకు నచ్చిన అభ్యర్థి ఎవరన్న విషయాన్ని ఆ అభ్యర్థికి కేటాయించిన నెంబరును నొక్కడం ద్వారా తెలియజేయవచ్చు.

పార్టీ సూచించిన పేర్లలో తమకు నచ్చిన వారు లేకపోతే ఆ విషయాన్ని తెలియజేసేందుకూ అవకాశం కల్పిస్తారు. నచ్చిన అభ్యర్థి పేరును కూడా చెప్పవచ్చు. ఈ మొత్తం విధానం కంప్యూటర్ల ద్వారా జరుగుతుంది. దీంతో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే పూర్తిగా ఐవీఆర్ఎస్‌పై ఆధారపడకుండా, ఈ విధానంలో వచ్చిన ఫలితాలను సరిచూసుకోవాలని టిడిపి భావిస్తోంది.

కండువా కప్పి స్వాగతం

కండువా కప్పి స్వాగతం

తెలుగుదేశం పార్టీలో చేరిని పలువురు నాయకులను పార్టీ కండువా కప్పి స్వాగతం పలుకుతున్న ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.

పార్టీ కార్యాలయం వద్ద నాయకులు

పార్టీ కార్యాలయం వద్ద నాయకులు

తెలుగుదేశం పార్టీలో చేరిని పలువురు నాయకులను పార్టీ కండువా కప్పి స్వాగతం పలుకుతున్న ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా పలువురు నాయకులు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

చంద్రబాబుకు పుష్పగుచ్ఛం

చంద్రబాబుకు పుష్పగుచ్ఛం

తెలుగుదేశం పార్టీలో చేరిని పలువురు నాయకులను పార్టీ కండువా కప్పి స్వాగతం పలుకుతున్న ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా బాబుకు పుష్పగుచ్ఛం అందిస్తున్న ఓ నాయకుడు.

మీడియాతో చంద్రబాబు

మీడియాతో చంద్రబాబు

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల ఎంపికలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. 'మీ ఊరు.. మీ అభ్యర్థి.. మీ ఇష్టమే నాకూ ఇష్టం' అనే నినాదంతో దేశంలోనే తొలిసారి వినూత్న విధానానికి తెరతీస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజల అభీష్టానికి అనుగుణంగా అభ్యర్థిని నిర్ణయించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

ఐవిఆర్ఎస్ విధానంలో..

ఐవిఆర్ఎస్ విధానంలో..

ఐవిఆర్ఎస్ విధానంలో అభిప్రాయాలను ఎలా సేకరించాలో వివరిస్తున్న చంద్రబాబు.

English summary
Setting a new trend in the selection of candidates for Assembly and Lok Sabha constituencies, the TDP has unveiled a massive exercise for eliciting choice of voters in their respective constituencies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X