ఫలితం తేలకముందే చేతులేత్తిసిన టీడీపీ ..?
జూన్ 4న వెలువడే ఫలితాలు కోసం ఏపీ ప్రజలు మొత్తం కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. గెలుపుపై ఇరు వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈసారి పోలింగ్ శాతం పెరగడంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అని సర్వే సంస్థలు సైతం పసిగట్టలేకపోతున్నాయి. అయితే పోలింగ్ తర్వాత ఓటర్ల నాడి ఎలా ఉందనే దానిపై రాజకీయ నాయకులకు అంతు చిక్కడం లేదు.ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే విషయంలో సరైన క్లారిటీ రావడం లేదు. ఇప్పటి వరకు వెలువడిన సర్వేలు కొన్ని వైసీపీకి అనుకూలంగా చెప్పగా, మరికొన్ని కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తేశ్చాయి.
ఇదిలా ఉంటే ఫలితాలకు ముందు టీడీపీ డైలామాలో పడినట్టు కనిపిస్తోంది. పోలింగ్ తర్వాత విజయంపై గట్టి నమ్మకంతో ఉన్న తెలుగు తమ్ముళ్లు కౌంటింగ్ తేదీ దగ్గరపడే కొద్ది డీలా పడిపోతున్నట్టు తెలుస్తోంది. పక్కాగా గెలిచే సీట్లలో ఓడిపోతున్నామే అని బాధ టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. దీనికి టీడీపీ రెబల్స్ కారణమని తెలుస్తోంది. టికెట్ దక్కకపోవడంతో కొందరు టీడీపీ నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. ఇదే ఇప్పుడు టీడీపీ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది.

అరకు నియోజకవర్గానికి చెందిన సివేరి అబ్రహాం, విజయనగరం నియోజకవర్గానికి చెందిన మీసాల గీత, అమలాపురం నియోజకవర్గానికి చెందిన పరమట శ్యాం కుమార్, పోలవరం నియోజకవర్గానికి చెందిన ముడియం సూర్య చంద్రరావు, ఉండి నియోజకవర్గానికి చెందిన వేటుకూరి వెంకట శివరామరాజు, సత్యవేడు నియోజకవర్గానికి చెందిన జడ్డా రాజశేఖర్ వంటి నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఈ నియోజకవర్గాల ఫలితాలపై టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
రెబల్‌గా పోటీ చేసిన అభ్యర్థులు ఎంత వరకు ఓట్లు సాధించగలరు, ఎన్ని ఓట్లు చీల్చగలరు అనే దానిపై టీడీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికి టీడీపీ సానుభూతిపరులు వీరికి అండగా నిలిచారనే అనుమానం వ్యక్తం అవుతోంది.దాదాపు ఆరు నియోజకవర్గాల్లో రెబల్స్ ప్రభావం ఉంటుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేసిన నియోజకవర్గాలపై టీడీపీ పెద్దగా గెలుపుపై నమ్మకం పెట్టుకోలేదని తెలుస్తోంది. రెబల్స్ సాధించే ఓట్లపై టీడీపీ నేతల గెలుపు ఆధారపడి ఉంటుంది. మరి టీడీపీ గెలుపవకాశాలపై రెబల్స్ ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications