Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీ వర్సెస్ వైసీపీ: నిరసనల హోరు; చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై బొత్సా ఘాటు వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం అధికార ప్రతిపక్ష పార్టీల నేతల ఆందోళనలతో రణరంగంగా మారింది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై, టీడీపీ నేత పట్టాభి ఇంటి పై దాడిని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బంద్ కొనసాగుతోంది. ఇదే సమయంలో టీడీపీ బంద్ కు నిరసనగా, తెలుగుదేశం పార్టీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. ప్రభుత్వం టీడీపీ బంద్ ను భగ్నం చేసే పనిలో పడింది.

 ఏపీలో కొనసాగుతున్న వైసీపీ ఆందోళనలు

ఏపీలో కొనసాగుతున్న వైసీపీ ఆందోళనలు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. చంద్రబాబు, పట్టాభి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రోడ్లపై బైఠాయించిన వైసిపి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కడప అంబేద్కర్ కూడలిలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల ఆందోళన కొనసాగగా, పులివెందులలో వైఎస్సార్సీపీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలోనూ, విజయవాడ సితార సెంటర్ లోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

 టీడీపీ నేతలపై మంత్రి బొత్సా ధ్వజం , పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం

టీడీపీ నేతలపై మంత్రి బొత్సా ధ్వజం , పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం

ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ తీరుపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ పైన తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు ఖండించిన ప్రతిపక్ష పార్టీల పైన విరుచుకుపడ్డారు. మావోయిస్టు పార్టీకి తెలుగుదేశం పార్టీకి తేడా లేదని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీని నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. బీజేపీతో ఉన్నాను అని చెబుతున్న చంద్రబాబు పార్ట్ నర్ పవన్ కళ్యాణ్ టీడీపీ నేతల తీరును సమర్థించడం సిగ్గుచేటని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల భాషపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. చంద్రబాబుది ఎప్పుడూ క్రిమినల్ ఆలోచనే అని బొత్సా మండిపడ్డారు.

బంద్ లో ప్రజలందరూ పాల్గొనకపోవడం చంద్రబాబుకు సిగ్గుచేటు

బంద్ లో ప్రజలందరూ పాల్గొనకపోవడం చంద్రబాబుకు సిగ్గుచేటు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చంద్రబాబుకు వత్తాసు పలకడంలో ఆంతర్యమేమిటో చెప్పాలని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. టిడిపి నేత పట్టాభి నోటికొచ్చినట్టు మాట్లాడారని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మీ పార్టీ ప్రతినిధి మాట్లాడిన మాటలకు ఏం సమాధానం చెప్తారో చెప్పాలని చంద్రబాబును ప్రశ్నించిన బొత్ససత్యనారాయణ నోటికి అన్నం తింటున్నావా ? అశుద్ధం తింటున్నావా అంటూ విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన బంద్ లో ప్రజలందరూ పాల్గొనకపోవడం చంద్రబాబుకు సిగ్గుచేటని, ఇప్పటికైనా చంద్రబాబు తీరు మార్చుకోవాలని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. టిడిపి పై దాడులు అంశంపై సమాధానం చెప్పకుండా దాటవేసిన బొత్ససత్యనారాయణ తెలుగుదేశం పార్టీని, తాజా పరిణామాలపై టీడీపీకి మద్దతు పలికిన ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.

 టీడీపీ ఆఫీసులపై దాడులను ఖండించిన పవన్ కళ్యాణ్, సోము వీర్రాజు

టీడీపీ ఆఫీసులపై దాడులను ఖండించిన పవన్ కళ్యాణ్, సోము వీర్రాజు

ఇదిలా ఉంటే మంగళవారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటి దాడులు జరగలేదని ఇవి ప్రజాస్వామ్యానికి విఘాతం అని ఈ దాడులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని పవన్కళ్యాణ్ పేర్కొన్నారు. దాడులకు తెగబడిన వారిని వెంటనే శిక్షించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులను బిజెపి తీవ్రంగా ఖండించింది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు టీడీపీ చేస్తున్న ఆరోపణలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారని వైసీపీ చేసిన దాడులపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు మాట్లాడే భాష విషయంలో జాగ్రత్తలు వహించాలని సోము వీర్రాజు పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+