చంద్రబాబు విజన్ 2047పై వైసీపీ వర్సెస్ టీడీపీ ట్వీట్ వార్..! పంచ్ లే పంచ్ లు..

ఏపీలో భవిష్యత్ ప్రణాళికలతో కూడిన విజన్ 2047 డాక్యుమెంట్ ను సీఎం చంద్రబాబు తాజాగా విడుదల చేశారు. దీన్ని అధికార కూటమి భవిష్యత్ ప్రణాళికగా చెప్తుండగా.. విపక్ష వైసీపీ మాత్రం విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ విడుదలపై విమర్శలు గుప్పిస్తూ వైఎస్ జగన్ పెట్టిన ట్వీట్.. దానికి కౌంటర్ గా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పెట్టిన ట్వీట్.. తిరిగి కౌంటర్ ఇస్తూ వైసీపీ పెట్టిన ట్వీట్ చర్చనీయాంశంగా మారుతున్నాయి.

ముందుగా చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ మీద విమర్శలు గుప్పిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ పెట్టారు. ఇందులో ఆయన...విజన్‌-2047 పేరిట చంద్రబాబు మరో మారు పబ్లిసిటీ స్టంట్‌కు దిగారన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి, మాయచేడానికి ఇదొక ఎత్తుగడ మాత్రమేనని, చంద్రబాబుగారి పత్రంలో రాష్ట్రం అవసరాలకు, ప్రజల అవసరాలకు చోటేలేదని తెలిపారు. వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదన్నారు. ఆయన పాలన ఎప్పుడూ ప్రజలు తనకిచ్చిన ఐదేళ్ల కాలంలో తన మేనిఫెస్టోలో చెప్పినవాటి అమలు మీద ఎప్పుడూ ఉండదన్నారు. ఎప్పుడూ ప్రజలను మోసం చేయడంమీదనే, ప్రజలను మాయ చేయడం మీదనే తన ధ్యాసంతా ఉంటుందన్నారు.

tdp vs ysrcp tweet war on Chandrababu s vision 2047-who said what

దీనికి కౌంటర్ గా టీడీపీకి చెందిన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మరో ట్వీట్ పెట్టారు. ఇందులో ఆయన.. విజన్ గురించి నీలాంటి ప్రిజనరీలకు ఏం తెలుస్తుంది "11 మోహన్ రెడ్డి" గారు? అంటూ ప్రశ్నించారు. దీనికి జగన్ విమర్శల ట్వీట్ ను ట్యాగ్ చేశారు. అలాగే ప్రెస్ మీట్ కూడా పెట్టి జగన్ విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.

దీంతో వైసీపీ ఇవాళ మంత్రి అనగానికి మరింత ఘాటుగా ట్వీట్ పెట్టింది. బాధ్యత లేని అనగాని..నోరు అదుపులో పెట్టుకో..
వరదల్లో బెజవాడ మునిగిపోతే..సింగపూర్లో పేకాట ఆడుతూ ఎంజాయ్ చేసిన బాధ్యత లేని మంత్రి అనగాని..జగన్ గారిని విమర్శించే అర్హత నీకుందా? అని వైసీపీ ప్రశ్నించింది. ఎన్నికల్లో చంద్రబాబు చెప్పిన హామీలకే దిక్కులేదు..ఎప్పుడో 2047కు విజనేంటి? అని నిలదీసింది. ఆరు నెలలకే మీ మోసాలు ప్రజలకు అర్థమయ్యాయని గుర్తుచేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+