'ముద్రగడకు ధ్వంసం చేయడం అలవాటే': తిరిగి వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్
ఏలూరు: కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తనకు పదవి లేనప్పుడు ఉద్యమం చేసి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం అలవాటేనని ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్ మంగళవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే తమకు సమ్మతమేనని చెప్పారు. రాజకీయ రిజర్వేషన్లలో స్పష్టత ఉండాలన్నారు. తమకు (బీసీలకు) మాత్రం అన్యాయం జరగకూడదని ఆయన చెప్పారు.

తిరిగి కేరళ వెళ్లిన పవన్ కళ్యాణ్
తుని ఘటన నేపథ్యంలో కేరళలో సినిమా షూటింగులో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆగమేఘాల పైన హైదరాబాద్ వచ్చి, సోమవారం నాడు విలేకరుల సమావేశంలో విధ్వంసంపై మాట్లాడిన విషయం తెలిసిందే.
సినిమా షూటింగులో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆదివారం సాయంత్రం వెంటనే హైదరాబాద్ బయలుదేరారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు విలేకరులతో మాట్లాడారు. తుని ఘటన పైన ప్రభుత్వాన్ని, పోలీసులను, అలాగే కాపు నేతలను ఆయన తప్పుపట్టినట్లుగా కనిపించింది.

షూటింగ్ మధ్యలో ఆపేసుకొని వచ్చిన పవన్ కళ్యాణ్ మంగళవారం తిరిగి కేరళ వెళ్లారు. సమాచారం మేరకు కేరళ అడవుల్లో రెండు మూడు సన్నివేశాలు తీయాల్సి ఉందని తెలుస్తోంది. ఆయన ఆగమేఘాల మీద హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో షూటింగ్ ఒకటి రెండు రోజులు పొడిగించే అవకాశముందని తెలుస్తోంది.
-
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!!












Click it and Unblock the Notifications